Advertisement

‘మీరా’ ఆడియో రిలీజ్‌

Tue 17th Mar 2015 07:46 AM
horror movie meera,meera audio launch,telugu movie meera  ‘మీరా’ ఆడియో రిలీజ్‌
‘మీరా’ ఆడియో రిలీజ్‌
Advertisement

ఆదిత్య ఆనంద్‌, నికిత పవార్‌, ఇషిక సింగ్‌ ప్రధాన పాత్రల్లో యునికో సినీ స్క్వాడ్‌, 150ఎం ఎంటర్‌టైనర్స్‌ పతాకాలపై సంతోష్‌ యుబ్యులస్‌ దర్శకత్వంలో గాజుల రమేష్‌, గాజుల కుమార్‌ నిర్మిస్తున్న హార్రర్‌ థ్రిల్లర్‌ ‘మీరా’(ఎ బ్లడీ లవ్‌స్టోరీ). ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సురేష్‌ కొండేటి ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను సురేష్‌ కొండేటి, టీజర్‌ను తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించారు. చిత్రంలోని పాటలను ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌, దర్శకనిర్మాత సాయి వెంకట్‌, హేమాస్‌ మీడియా అధినేత కె.సురేష్‌బాబు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ చిత్ర దర్శకుడు సంతోష్‌ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో కాఫీ మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా..

తుమ్మలపల్లి రామసత్యనారాయణ: ఒక సినిమా భవిష్యత్తు ఆ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌ డిసైడ్‌ చేస్తాయి. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. ఈ చిత్రాన్ని రెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి చేశారు. ఈ యూనిట్‌కి తప్పకుండా విజయం దక్కుతుంది. ఈ సందర్భంగా చిన్న నిర్మాతలకు నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. మీరు ఎంత బడ్జెట్‌లో సినిమా తీసినా 50 లక్షలు పబ్లిసిటీకి పెట్టుకుంటే సినిమా జనంలోకి వెళ్తుంది. మీరు చేసిన ప్రమోషన్‌తో విజయం సాధించగలుగుతారు.

సురేష్‌ కొండేటి: టైటిల్‌ చాలా బాగుంది. ట్రైలర్‌ కూడా చాలా బాగుంది. ఈమధ్యకాలంలో హార్రర్‌, థ్రిల్లర్‌ మూవీస్‌కి ఆదరణ ఎక్కువగా వుంది. ఆ జోనర్‌లో చేసిన ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను.

సాయివెంకట్‌: సాంగ్స్‌ చూసి చాలా ఎక్సైట్‌ అయ్యాను. టేకింగ్‌ చాలా బాగుంది. బాలీవుడ్‌ సినిమాల రేంజ్‌లో ఆ లొకేషన్స్‌గానీ, విజువల్స్‌గానీ వున్నాయి. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు కలుగుతోంది. 

కె.సురేష్‌బాబు: ఈమధ్యకాలంలో సినిమాలను జడ్జ్‌ చేయడం చాలా కష్టంగా వుంటోంది. ఏ సినిమాలు ఆడతాయి, ఏవి ఆడవు అనేది తెలియడం లేదు. ఇప్పుడు హార్రర్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. ఈ చిత్రం పాటలుగానీ, ట్రైలర్‌గానీ చాలా బాగున్నాయి. సినిమాలో గ్రాఫిక్‌ వర్క్‌ ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద సినిమాల రేంజ్‌లో గ్రాఫిక్స్‌ వున్నాయి. కాబట్టి ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. 

సంతోష్‌ యుబ్యులస్‌: థ్రిల్లర్‌ అంటేనే కొత్తదనంతో కూడుకున్న సినిమా అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమా దాన్ని మించి డిఫరెంట్‌గా వుంటుంది. ఇందులో పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుందని చెప్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. నేను ఈ సినిమాకి మ్యూజిక్‌ చేయడానికి మురళి ఎంతో సహకరించారు. దానికి సంబంధించిన ఎరేంజ్‌మెంట్స్‌ అన్నీ అతనే చూసుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ శంకర్‌ చేశారు. అలాగే యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లనే ఒక మంచి సినిమా చెయ్యగలిగాను. ఈ సినిమా తప్పకుండా మీ అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుందన్న కాన్ఫిడెన్స్‌ నాకు వుంది.

ఆదిత్య ఆనంద్‌: రెండు సంవత్సరాలుగా వస్తున్న కల ఒక్కసారి నిజమైతే ఎలా వుంటుందో ఇప్పుడు నాకు అలా వుంది. మంచి ఆర్టిస్ట్‌ కావాలన్నది నా కల. చదువుకోమని మా పేరెంట్స్‌ పంపిస్తే సినిమాల్లో వేషాల కోసం ట్రై చేసేవాడిని. ఫోటోలు పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరిగాను. ప్రసాద్‌ ల్యాబ్‌లో ఆడియో ఫంక్షన్స్‌ జరుగుతుంటే ఎవరైనా ప్రొడ్యూసర్‌ ఛాన్స్‌ ఇస్తారేమోనని ఫోటోలు పట్టుకొని బయట నిలబడేవాడిని. ఇప్పుడు ఇక్కడ స్టేజ్‌ మీద నిలబడి మాట్లాడుతున్నాను. దానికి కారణం మా అన్నయ్య రమేష్‌. నా యాంబిషన్‌ని గుర్తించి నాతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అన్నయ్యకి థాంక్స్‌ చెప్తున్నాను. అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్థలు తెలియజేస్తున్నాను.

ఇషిక సింగ్‌: ఇది ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. సినిమా చూస్తున్నంత సేపు ఏ క్యారెక్టర్‌ ఎలా బిహేవ్‌ చేస్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాదు. తర్వాత అన్నీ రివీల్‌ అవుతాయి. చాలా యునీక్‌గా ఈ సినిమా వుంటుంది. నాకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. నాకు తప్పకుండా మంచి పేరు తెచ్చే క్యారెక్టర్‌ అది. 

ఆదిత్య ఆనంద్‌, నికిత పవార్‌, ఇషిక సింగ్‌, సూర్య, సరయు, శ్రీధర్‌ నానా, ఆనంద్‌ భారతి, తిలక్‌, వాజ్‌పేయి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చరణ్‌ అక్కల, మాటలు: శివసిద్దార్థ్‌, నిర్మాతలు: గాజుల రమేష్‌, గాజుల కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, పాటలు, దర్శకత్వం: సంతోష్‌ యుబ్యులస్‌.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement