Advertisement

మార్చి 29న ‘మరియన్‌’ ఆడియో

Sat 14th Mar 2015 08:55 AM
dhanush,mariyan movie,sobha rani,svr media,a.r.rahman,bharat bala  మార్చి 29న ‘మరియన్‌’ ఆడియో
మార్చి 29న ‘మరియన్‌’ ఆడియో
Advertisement

ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌, ఆస్కార్‌ ఫిలిం ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ధనుష్‌ హీరోగా భరత్‌బాల దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన చిత్రం ‘మరియన్‌’. తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ఎన్నో మంచి చిత్రాలను ఎస్‌.వి.ఆర్‌. మీడియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందించిన శోభారాణి ‘మరియన్‌’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను మార్చి 29న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశారు నిర్మాత శోభారాణి. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ..

‘‘మా ఎస్‌.వి.ఆర్‌. మీడియా బేనర్‌లో ఎన్నో విభిన్నమైన సినిమాలు అందించడం జరిగింది. అదే కోవలో ధనుష్‌ హీరోగా నటించిన ‘మరియన్‌’ సినిమా కూడా వుండబోతోంది. మరియన్‌ అంటే చావు లేని వాడు అని అర్థం. అతన్ని యముడు కూడా ఏమీ చేయలేడు. అంతటి విల్‌ పవర్‌ వున్న క్యారెక్టర్‌లో ధనుష్‌గారు చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశారు. ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా చేసిన సినిమా. 2008లో ముగ్గురు విదేశాలలో కిడ్నాప్‌ అయ్యారు. ఆ ముగ్గురు 21 రోజుల తర్వాత కిడ్నాపర్స్‌ చెర నుంచి తప్పించుకొని వచ్చారు. దాన్ని ఒక సినిమాగా మలచడంలో భరత్‌బాలగారు ఎంతో కృషి చేశారు. ఆ ముగ్గురినీ కలుసుకొని ఎంతో రీసెర్చ్‌ చేసి ఈ సబ్జెక్ట్‌ రెడీ చేశారు. ధనుష్‌గారు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తన క్యారెక్టర్‌ను చేశారు. ఈ సినిమాకి రెహమాన్‌గారి మ్యూజిక్‌ చాలా ఎస్సెట్‌ అని చెప్పాలి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ స్క్రిప్ట్‌ రెడీ చేయడంలో ధనుష్‌గారు కూడా 9 నెలలు కష్టపడ్డారు. భరత్‌బాలగారికి ఎంతో సన్నిహితుడైన ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ కథ విని ఎంతో ఇన్‌స్పైర్‌ అయి మ్యూజిక్‌ చేయడానికి ఒప్పుకున్నారు. పాటలు చాలా అద్భుతంగా చేశారు. తమిళ్‌లో ఆల్రెడీ ఈ పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అలాగే రీరికార్డింగ్‌ కూడా కొత్త పద్ధతిలో చేయడం జరిగింది. ఈ చిత్రం ఆడియోను మార్చి 29న గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. సినిమా ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement