Advertisement

'గీతోపదేశం' ఆడియో ఆవిష్కరణ..!

Sat 14th Mar 2015 08:52 AM
geethopadesam audio release,vanditha,madhubabu,jinna  'గీతోపదేశం' ఆడియో ఆవిష్కరణ..!
'గీతోపదేశం' ఆడియో ఆవిష్కరణ..!
Advertisement

అర్జున్ యజత్, వందిత, మధు ప్రధాన పాత్రల్లో శ్రీసాయి విశ్వక్ సేన పిక్చర్స్ పతాకంపై జిన్నా దర్శకత్వంలో మధుబాబు నిర్మిస్తున్న చిత్రం 'గీతోపదేశం'. ఈ చిత్రం ఆడియో శనివారం(మార్చి14) హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన దర్శకుడు రాజ్ కిరణ్ ఆడియోను ఆవిష్కరించి మొదటి సిడీని ప్రముఖ దర్శకనిర్మాత సానాయాదిరెడ్డికి అందించారు. రాహుల్, వెంకీ  సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో శ్రేయాస్ మీడియా ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత మధుబాబు మాట్లాడుతూ "ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది. పోలీస్ ఉద్యోగం చేస్తున్న నన్ను ఈ పాత్రకి సరిపోతానని డైరెక్టర్ నాతో ఈ సినిమాలో నటించేలా చేసారు. నాలుగున్నర సంవత్సరాలు డైరెక్టర్ ఈ కథను ప్రిపేర్ చేసారు. ఈ సినిమా కథ అంతా పోలీసుల మీదే నడుస్తూ ఉంటుంది" అని అన్నారు.

దర్శకుడు జిన్నా మాట్లాడుతూ "ఈ సినిమాలో భారతంలో అర్జునుడు, దుర్యోధనుడు లాంటి రెండు పాత్రలు ఉంటాయి అందుకే 'గీతోపదేశం' అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా ప్రారంభించాక ఆర్ధిక పరిస్థితుల కారణంగా మధ్యలో ఆగిపోయింది. కానీ ఈరోజు ఈ స్టేజ్ కి రావడానికి కారణం శ్రీనివాస్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.

ప్రముఖ దర్శకనిర్మాత సానాయాదిరెడ్డి మాట్లాడుతూ "మధు ఒక కానిస్టేబుల్ అయినా మంచి సినిమా తీయాలనే సదుద్దేసంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆకారానికి ఆయన విలన్ గా ఉన్నా చాలా సాఫ్ట్ పర్సన్. ఈ సినిమాతో మధు స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదగాలని, సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నా" అని అన్నారు. 

డైరెక్టర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ "జిన్నా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సినిమా తీయాలనే ప్యాషన్ తో ఆయన ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ట్రైలర్, సాంగ్స్ చాలా బావున్నాయి. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది" అని అన్నారు.

బివిఎస్ రవి మాట్లాడుతూ "ట్రైలర్ చూస్తే సినిమాలో డైలాగ్ డెలివరీ, పిక్చరైజేషన్ చాలా బావున్నాయని తెలుస్తుంది. సినిమాలో పాటలు కుడా చాలా బావున్నాయి. చిన్న సినిమాలలో ఇది ఓ మంచి సినిమాగా మిగిలిపోతుంది" అని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీ స్టేట్ జర్నల్ మెంబర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ "సినిమా విజవంతం అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

సంగీత దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ "సినిమాలో 3 పాటలు అధ్బుతంగా వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యే మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది" అని అన్నారు.

వెంకి మాట్లాడుతూ "ఈ సినిమా లో ఓ భాగం అవ్వడానికి సహాయం చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

నందు మాట్లాడుతూ "రాహుల్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని అన్నారు.

హీరో అర్జున్ యజత్ మాట్లాడుతూ "ఫన్ లవింగ్, యాక్షన్ ఎంటర్ టైనింగ్ సినిమా ఇది. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తట్టుకొని ఈ సినిమాను విడుదల చేస్తున్న డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు రావాలి" అని అన్నారు. 

హీరోయిన్ వందిత మాట్లాడుతూ "ఇదొక డిఫరెంట్ సినిమా. నాకు ఈ అవకాసం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి నా ధన్యవాదాలు" అని అన్నారు.

సాంకేతిక వర్గం: కెమెరా: రాహుల్ మాచినేని, ఎడిటింగ్: పి.వి. నరసింహారావు, ఫైట్స్: రామ్ సుంకర, డాన్స్: ఎమ్. చిరంజీవి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement