Advertisement

ప్రముఖ హీరోయిన్‌కు స్వైన్‌ఫ్లూ

Sun 01st Mar 2015 04:17 AM
sonamkapoor,swine flu,rajkoat,hospital  ప్రముఖ హీరోయిన్‌కు స్వైన్‌ఫ్లూ
ప్రముఖ హీరోయిన్‌కు స్వైన్‌ఫ్లూ
Advertisement

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనీల్‌కపూర్‌ కుమార్తె, హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌కు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకింది. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె శనివారం ఓ ఆస్పత్రిలో చేరింది. అక్కడ అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆమెకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు తేలిందని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లా కలెక్టర్‌ మనీష్‌చంద్ర వెల్లడించారు. ఆమె ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌ కోసం గుజరాత్‌కు వెళ్లింది. అయితే ముంబైనుంచి గుజరాత్‌కు వస్తున్న క్రమంలోనే ఆమెకు వ్యాధి సోకి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు వేసవి ఆరంభం అయితే స్వైన్‌ఫ్లూ ప్రభావం తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం భావించింది. అయితే అంచనాలకు మించి ఎండలు కాస్తున్నప్పటికీ స్వైన్‌ఫ్లూ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఈ రెండు రోజుల్లో మరో 50 మంది స్వైన్‌ఫ్లూ బారినపడినట్లు సమాచారం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement