Advertisement

'కోలంబస్‌'గా వస్తానంటున్న సుమంత్‌ అశ్విన్‌..

Sun 01st Mar 2015 04:23 AM
sumanth ashwin,colombus,kerintha,dil raju  'కోలంబస్‌'గా వస్తానంటున్న సుమంత్‌ అశ్విన్‌..
'కోలంబస్‌'గా వస్తానంటున్న సుమంత్‌ అశ్విన్‌..
Advertisement

యువహీరో సుమంత్‌ అశ్విన్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మాస్‌ ఇమేజ్‌ కోసం కాకుండా ప్రధానంగా యువతకు మెచ్చే సినిమాలను మాత్రమే సుమంత్‌ అశ్విన్‌ అంగీకరిస్తున్నాడు. ఇక ఈ ఏడాది సుమంత్‌ అశ్విన్‌ నటిస్తున్న రెండు సినిమాలు ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమంత్‌ అశ్విన్‌ ఇప్పటికే దిల్‌రాజ్‌ నిర్మాతగా, అడవిసాయి కిరణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కేరింతలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు 'కోలంబస్‌' సినిమకు కూడా సుమంత్‌ అశ్విన్‌ ఓకే చెప్పినట్లు సమాచారం. 'కేరింత' సినిమా షూటింగ్‌ పూర్తవగానే 'కోలంబస్‌'ను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాను కూడా ఈ ఏడాది ద్వితాయర్థంలో రిలీజ్‌ చేస్తారని సమాచారం. ఇక 'కోలంబస్‌'తో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement