Advertisement

ఎన్టీఆర్‌ గురించి రెచ్చిపోయిన వర్మ..!!

Tue 10th Feb 2015 06:56 AM
ram gopal varma,senior ntr,twitter,temper,junior ntr  ఎన్టీఆర్‌ గురించి రెచ్చిపోయిన వర్మ..!!
ఎన్టీఆర్‌ గురించి రెచ్చిపోయిన వర్మ..!!
Advertisement

పబ్లిసిటీ కోసం వర్మ పాకులాడుతారనేది ఇండస్ట్రీలో ఉన్న వాదన. అది నిజమనేలా మరోసారి వర్మ వ్యవహరించారు. ఈమధ్య మీడియాలో ఆయనకు పెద్దగా చోటులేకపోవడంతో ఈసారి ట్విట్టర్‌లో రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేశాడు. టెంపర్‌ సినిమా చూసిన వర్మ ఆ సినిమా గురించి స్పందిస్తూ.. సీనియర్‌ ఎన్టీఆర్‌ను తక్కువచేసి మాట్లాడాడు. జూ. ఎన్టీఆర్‌ నటనముందు సీనియర్‌ ఎన్టీఆర్‌ 'సున్నా' అనేలా వరుసపెట్టి కామెంట్లు పోస్ట్‌ చేశాడు. దీనికి సీనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులనుంచి ఘాటుగా స్పందన రావడంతో వెనక్కితగ్గిన వర్మ.. కొడుకు విజయాన్ని చూసి తండ్రి ఆనందిస్తే.. మనువడి ఘనతను చూసి తాత మరింత గర్వంగా ఫీలవుతారనే తాను ఇలా వ్యాఖ్యానించినట్లు చెప్పాడు. అంతేకాకుండా అంతకుముందు టీడీపీకి గతం.. సీనియర్‌ ఎన్టీఆర్‌ అయితే.. నేడు, రేపు జూ. ఎన్టీఆర్‌ అంటూ చేసిన పోస్టింగ్‌ను కూడా డెలిట్‌ చేశాడు. ఇక మూర్ఖులు, ఇడియట్స్‌ అయితే మాత్రమే తన వ్యాఖ్యానాలను తప్పుగా అర్థం చేసుకుంటారని, తాను కూడా సీనియర్‌ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్‌ అని చెప్పుకొచ్చాడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి పునాదిలా ఉన్న సీనియర్‌ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడితే కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతుందనే ఇలా వ్యవహరించారనే వాదనలు వినబడుతున్నాయి. మరి తాతను తక్కువ చేసి మాట్లాడితే.. జూ. ఎలా స్పందిస్తారో భవిష్యత్తులోనే తేలుతుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement