Advertisementt

'పందెం కోళ్ళు' ఆడియో లాంచ్..!

Wed 21st Jan 2015 12:14 PM
sun pictures,samooha talkies,pandem kollu,dhanush,thapsee,audio launch  'పందెం కోళ్ళు' ఆడియో లాంచ్..!
'పందెం కోళ్ళు' ఆడియో లాంచ్..!
Advertisement
Ads by CJ

తమిళ్ లో ఘన విజయం సాధించిన 'అడుకాళం' చిత్రాన్ని సన్ పిక్చర్స్, సమూహ టాకీస్ వారు సంయుక్తంగా తెలుగు లో 'పందెంకోళ్ళు'  పేరుతో అందిస్తున్నారు.  ధనుష్, తాప్సీ కథానాయకులు. వెట్రిమారన్ దర్శకుడు. ఎ.శేఖర్ బాబు, ఎం.కిషోర్ కుమార్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. 

ఆడియో లాంచ్ కి అథిదిగా వచ్చిన కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో విడుదలయిన డబ్బింగ్ చిత్రాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుంది. విశాల్ నటించిన 'పందెం కోడి' సినిమాల ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని'' అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షుడు, సీనియర్ ప్రొడ్యూసర్ ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ "తమిళం లో చాలా రియలిస్టిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు. అదే సినిమాని తెలుగు లో అనువదించడం చాలా ఆనందంగా ఉంది. పాటలు కూడా చాలా బావున్నాయి. ఒక పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బింగ్ సినిమాలలో ఒక మంచి సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంది" అని అన్నారు.

ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి మాట్లాడుతూ "ధనుష్ కి రఘువరన్ బి.టెక్ ఎలా ప్లస్ పాయింట్ గా నిలిచిందో ఈ చిత్రం కూడా అంత పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు. ఈ సినిమా కి మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి, పాటలు:వనమాలి, సంగీతం: జి.వి.ప్రకాష్, నిర్మాణం: నెల్లూరు నాగరాజు, కెమెరా: వేల్ రాజ్. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ