Advertisement

సినీజోష్‌ రివ్యూ: లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌

Sat 31st Jan 2015 02:34 AM
ladies and gentlemen review,madhura sridhar reddy,raghu kunche,telugu movie review  సినీజోష్‌ రివ్యూ: లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌
సినీజోష్‌ రివ్యూ: లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌
Advertisement

షిరిడీ సాయి కంబైన్స్‌

లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌

నటీనటులు: చైతన్యకృష్ణ, మహత్‌, అడవిశేష్‌, కమల్‌ కామరాజ్‌, 

స్వాతి దీక్షిత్‌, నిఖితా నారాయణ్‌, జాస్మిన్‌ భాసిన్‌ తదితరులు

కెమెరా: జగన్‌ చావలి

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

సంగీతం: రఘు కుంచె

కథ: సంజీవ్‌రెడ్డి

మాటలు: నివాస్‌

నిర్మాతలు: మధుర శ్రీధర్‌రెడ్డి, డా॥ ఎం.వి.కె.రెడ్డి

దర్శకత్వం: పి.బి.మంజునాథ్‌

విడుదల తేదీ: 30.1.2015

రొటీన్‌ సినిమాలకు, ఫార్ములా సినిమాలకు దూరంగా వుంటూ కొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు తియ్యాలన్న ఎయిమ్‌తో ‘స్నేహగీతం’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన మధుర శ్రీధర్‌రెడ్డి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు తను నిర్మాతగా వ్యవహరిస్తూ కొత్త తరహా సినిమాలు నిర్మిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా పి.బి.మంజునాథ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’. సోషల్‌ మీడియా, సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో మూడు కథలతో రూపొందిన ఈ సినిమా ఈరోజు వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయింది. తెలుగులో ఇప్పటివరకు రాని ఒక కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొని చేసిన ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయింది? కొత్త తరహా చిత్రాలు తీసి ఆడియన్స్‌ని మెప్పించాలన్న మధుర శ్రీధర్‌రెడ్డి కోరిక ఈ సినిమాతో నెరవేరిందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: ఇది మూడు విభిన్న కథలతో రూపొందిన సినిమా. సోషల్‌ మీడియాలో తనకు తగిన లవర్‌ కోసం వెతికే కుర్రాడు క్రిష్‌(చైతన్య కృష్ణ). 24 గంటలూ బిజినెస్‌ అంటూ భార్య ప్రియ(నిఖితా నారాయణ్‌)ను పట్టించుకోని ఆనంద్‌(కమల్‌ కామరాజ్‌). తను ప్రేమించిన మోడల్‌(జాస్మిన్‌ భాసిన్‌)కి అప్పు చేసి మరీ అన్నీ సమకూర్చే విజయ్‌(మహత్‌ రాఘవేంద్ర) సులభంగా డబ్బు ఎలా సంపాదించాలని నిత్యం ఆలోచిస్తుంటాడు. ఈ ముగ్గురి జీవితాలు సోషల్‌ మీడియావల్ల, ఇంటర్నెట్‌ వల్ల ఎలా మలుపు తిరిగాయన్నదే కథ. 

ప్లస్‌ పాయింట్స్‌: ఈ సినిమా మెయిన్‌గా చెప్పుకోదగ్గ ప్లస్‌ పాయింట్స్‌ నాలుగు వున్నాయి. ఒకటి ఎంచుకున్న కాన్సెప్ట్‌, రెండు ఎక్స్‌లెంట్‌గా వున్న ఫోటోగ్రఫీ, మూడు మ్యూజిక్‌, నాలుగు ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్సెస్‌. సోషల్‌ మీడియా వల్ల యువత ఎలా పెడదారి పడుతోంది అనే పాయింట్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. అలాగే సైబర్‌ క్రైమ్‌ చేయడం ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చు అనుకునే యూత్‌కి దానివల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా చక్కగా డిస్కస్‌ చేశారు. సంజీవ్‌రెడ్డి రాసుకున్న ఈ కథని డీల్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ కొంత వరకు సక్సెస్‌ అయ్యాడు. వీటన్నింటినీ విజువల్‌గా చాలా గ్రాండ్‌గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్‌ జగన్‌ చావలి హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్‌ ఎంతో జాగ్రత్తగా రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. వీటన్నింటికీ రఘు కుంచె ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌ అనిపిస్తుంది. ఈ మూడు కథల్లో చాలా ఎమోషన్స్‌ వున్నాయి. దానికి తగ్గట్టుగా రఘు రీరికార్డింగ్‌ అద్భుతంగా చేశాడు. అలాగే పాటలు కూడా కొత్తగా వుండడమే కాకుండా విజువల్‌గా కూడా ఆకట్టుకున్నాయి. సినిమా స్టార్టింగ్‌లో వచ్చే బుర్రకథ కూడా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసింది. ఆర్టిస్టుల విషయానికి వస్తే ప్రధాన పాత్రలు పోషించిన చైతన్యకృష్ణ, మహత్‌, అడవిశేష్‌, కమల్‌ కామరాజ్‌, స్వాతి దీక్షిత్‌, నిఖితా నారాయణ్‌, జాస్మిన్‌ భాసిన్‌ వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

మైనస్‌ పాయింట్స్‌: అనుకున్న కాన్సెప్ట్‌ మంచిదే. కానీ, దాన్ని నేరేట్‌ చేయడంలో డైరెక్టర్‌ పూర్తిగా సక్సెస్‌ కాలేకపోయాడు. స్లో నేరేషన్‌ వల్ల ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అయ్యే అవకాశం వుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ తక్కువగా వుండడం కూడా సినిమాకి మైనస్‌ అయింది. కేవలం కాన్సెప్ట్‌ మీదే సినిమా వెళ్తుంది తప్ప ఆడియన్స్‌కి అందులో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వలేకపోతున్నామని డైరెక్టర్‌ ఆలోచించలేదు. మంచి కామెడీ వుంటూ, సినిమా స్పీడ్‌గా వెళ్తుంటే సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్‌కి అందరూ షాక్‌ అయ్యేవారు. అలాంటిది ఏమీ లేకుండా స్లోగా సినిమా రన్‌ అవుతూ వుంటే నెక్స్‌ట్‌ ఏం జరగబోతుందో ఆడియన్స్‌కి ఇట్టే అర్థమైపోయింది. 

విశ్లేషణ: సోషల్‌ మీడియా మీద సినిమా చెయ్యాలనుకోవడం, దాని కోసం మూడు యదార్థ సంఘటనల్ని తీసుకొని కథలుగా రాసుకోవడం వరకు ఓకే. దాన్ని స్క్రీన్‌ మీద ఎంత స్పీడ్‌గా ప్రజెంట్‌ చెయ్యాలి, ఏవిధంగా ఆడియన్స్‌ని మెప్పించాలి అనే దానిమీద డైరెక్టర్‌కి సరైన అవగాహన లేదు. దాంతో చెప్పాలనుకున్న పాయింట్‌ మంచిదే అయినప్పటికీ సాగతీత ధోరణి వల్ల సరిగ్గా చెప్పలేకపోయాడు. మూడు కథలకు సంబంధించిన పాత్రల పరిచయాలు, వారి ఎమోషన్స్‌ చూపించడంతో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లో సోషల్‌ మీడియా, సైబర్‌ క్రైమ్‌కి సంబంధించిన కొన్ని విశేషాలు తప్ప కొత్తగా ఏమీ అనిపించదు. సెకండాఫ్‌కి వచ్చేసరికి కథలో కొంత ఊపు వస్తుంది. మూడు కథలూ ఒక్కటొక్కటిగా క్లైమాక్స్‌కి వచ్చే ప్రాసెస్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సోషల్‌ మీడియాకు బాగా అలవాటు పడిపోయిన యువత దాని ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని క్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సైబర్‌ క్రైమ్‌ ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుందో మహత్‌ చేసిన విజయ్‌ పాత్ర ద్వారా చెప్పారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ మూడు కథలూ అందరికీ కనెక్ట్‌ అవుతాయి. నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి ఒక కొత్త సినిమాని ఆడియన్స్‌కి పరిచయం చేశారు. డైరెక్టర్‌ పి.బి.మంజునాథ్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ అందర్నీ ఎగ్జిక్యూట్‌ చెయ్యడంలో ఆర్టిస్టుల నుంచి హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడం సక్సెస్‌ అయ్యాడు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ కూడా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా కనిపించింది. కాన్సెప్ట్‌ వైజ్‌ ఓకే అనిపించుకున్న ఈ సినిమా కమర్షియల్‌గా ఎంతవరకు సక్సెస్‌ అవుతుందనేది వెయిట్‌ అండ్‌ సీ. 

ఫినిషింగ్‌ టచ్‌: కాన్సెప్ట్‌ వైజ్‌ ఓకే.. మరి కమర్షియల్‌గా?

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement