Advertisementt

శృతిహాసన్‌ను ఏడిపించలేదంటున్న మంత్రి..!!

Sat 11th Apr 2015 03:12 PM
sruthi hasan,minister kamineni,flight  శృతిహాసన్‌ను ఏడిపించలేదంటున్న మంత్రి..!!
శృతిహాసన్‌ను ఏడిపించలేదంటున్న మంత్రి..!!
Advertisement
Ads by CJ

ఏపీ మంత్రి కామినేని సంచలన ప్రకటన చేశారు. తాను ఏ హీరోయిన్‌ను ఏడిపించలేదంటూ ఆయన ప్రకటించారు. అయితే ఆయన ఎందుకు ఈ ప్రకటన చేశారో అర్థంకాక మీడియావర్గాలు తలలు పట్టుకున్నాయి. అసలు జరిగిన విషయం ఏంటంటే ఓ వెబ్‌సైట్‌లో ఆయన హీరోయిన్‌ శృతిహాసన్‌ను ఏడిపించినట్లు వార్తలు వచ్చాయి. కామినేని చెన్నై వెళ్తుండగా అదే విమానంలో శృతిహాసన్‌ కూడా పయనించారని, ఈ సందర్భంగా తిహాసన్‌ మంత్రి కామినేని ఏడిపించినట్లు ఆ వెబ్‌సైట్‌లో వార్త వెలువడింది. అయితే ఈ విషయం అటు ఇండస్ట్రీ వర్గాలకుగాని ఇటు రాజకీయవర్గాలకుగాని తెలియదు. కాని మంత్రి స్వయంగా ఈ విషయంపై స్పందిస్తూ.. తన జీవితంలో ఏ అమ్మాయినీ తాను ఏడిపించలేదని, శృతిహాసన్‌ను ఏడిపించానన్న వార్తల్లో కూడా నిజం లేదని చెప్పారు. మరి ఎవరికీ తెలియని విషయాన్ని స్వయంగా మంత్రి తెలియజేసి ఏం సాధించాలనుకుంటున్నారో మీడియావర్గాలకు అంతుచిక్కలేదు. ఇది పబ్లిసిటీ స్టంట్‌ అనుకోవచ్చా..?

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ