Advertisement

విడుదలకు సిద్ధమైన ‘ఓకే బంగారం’

Sat 11th Apr 2015 09:31 AM
ok bangaram,maniratnam,ar rahman,dulkar salman,nitya menon,  విడుదలకు సిద్ధమైన ‘ఓకే బంగారం’
విడుదలకు సిద్ధమైన ‘ఓకే బంగారం’
Advertisement

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, నిత్యమీనన్‌ హీరోయిన్‌గా మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఓ కాదల్‌ కన్మణి’. ఈ చిత్రాన్ని ‘ఓకే బంగారం’ పేరుతో మద్రాస్‌ టాకీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకాలపై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే వారం ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. వచ్చేవారం ఈ సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో పెద్ద సక్సెస్‌ అయింది. అలాగే ఇప్పటివరకు వచ్చిన ప్రోమోస్‌ అన్నీ దేనికదే యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఎప్పుడుడెప్పుడు సినిమా రిలీజ్‌ అవుతుందా అని ఆడియన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకొని ఇంట్లో చెప్పలేని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకొని ఇద్దరూ ఒకేచోట కలిసి వుండే స్టోరీతో చేసిన సినిమా ‘సఖి’. ఈ సినిమా విషయానికి వస్తే ఒక అమ్మాయి, అబ్బాయి బాంబేలో కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ అబ్రాడ్‌ వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళడానికి కొంత టైమ్‌ వుంటుంది. ఈ టైమ్‌లో వాళ్ళిద్దరి మధ్య ఎట్రాక్షన్‌ ఏర్పడుతుంది. అబ్రాడ్‌ వెళ్ళే వరకు ఇద్దరూ కలిసి వుండాలని నిర్ణయించుకుంటారు. అలా లివింగ్‌ రిలేషన్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తారు. ఎబ్రాడ్‌ వెళ్ళే టైమ్‌ వచ్చినపుడు వాళ్ళు కలిసి వుంటారా లేక విడిపోతారా అనేది మిగతా కథ. లివింగ్‌ రిలేషన్స్‌ మీద బాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయి. కానీ, తెలుగులో రాలేదు. యూత్‌ ఆడియన్స్‌కి ఇది చాలా కొత్తగా వుంటుంది. ఇందులో ప్రకాష్‌రాజ్‌, అతని మిసెస్‌ మధ్య నడిచే ఫ్యామిలీ సీన్స్‌ చాలా అద్భుతంగా వుంటాయి. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్‌కి, హీరోహీరోయిన్ల లవ్‌ని కంపేర్‌ చేస్తూ వచ్చే సీన్స్‌ అందర్నీ ఆకట్టుకుంటాయి. రెహమాన్‌ మ్యూజిక్‌తో, పి.సి.శ్రీరామ్‌ అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌గా వుండే ఈ సినిమాని మెయిన్‌గా యూత్‌ని ఎయిమ్‌ చేస్తూ తీసినప్పటికీ ఫ్యామిలీ సెంటిమెంట్‌, ఎమోషన్స్‌ కూడా వున్నాయి. కాబట్టి కుటుంబ సమేతంగా అందరూ చూసి ఎంజాయ్‌ చేసేలా వుంటుంది’’ అన్నారు. 

దుల్కర్‌ సల్మాన్‌, నిత్యమీనన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, కోప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణిరత్నం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement