Advertisementt

బోయపాటి కి దొరికిన ఆణిముత్యం

Sun 26th Apr 2026 07:37 PM
boyapati  బోయపాటి కి దొరికిన ఆణిముత్యం
Boyapati Sreenu will design for Karthi బోయపాటి కి దొరికిన ఆణిముత్యం
Advertisement
Ads by CJ

మాస్ డైరెక్టర్ బోయపాటి, రామ్ తో తెరకెక్కించిన స్కంద డిజాస్టర్ తరవాత బాలయ్య తో అఖండ చిత్రానికి సీక్వెల్ గా అఖండ తాండవం తెరకెక్కించగా అది పాన్ ఇండియా స్థాయి మూవీ కాదని ఆడియన్స్ తేల్చేసారు. అఖండ తాండవం అంచనాలు అందుకోవడంలో విఫలమవడంతో బోయపాటి కి కాస్త బ్రేక్ వచ్చేసింది. 

ఆయనతో ఇంతకుముందు సినిమా చేస్తారన్న హీరోలు సైలెంట్ అయ్యారు. ఈమధ్యన బోయపాటి శ్రీను ముంబై వెళ్లి అక్కడ బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడిచింది. తాజాగా బోయపాటి కి నెక్స్ట్ హీరో దొరికాడని న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో నడుస్తుంది.

మాస్ అప్పీల్స్ తో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే బోయపాటికి దొరికిన ఆణిముత్యం కోలీవుడ్ హీరో కార్తీ అట. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కార్తీ తో బోయపాటి నెక్స్ట్ అంటున్నారు. మరి మాస్ అప్పీల్ తో హీరో కార్తీ ని బోయపాటి ఎలా చూపిస్తారో అనేది చూడాలి.

Boyapati Sreenu will design for Karthi:

Boyapati Srinu Teams Up With Karthi After Akhanda 2

Tags:   BOYAPATI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ