వీకెండ్స్ వస్తే చాలు హైదరాబాద్ పబ్ లు కిటకిటలాడిపోతుంటాయి. ఇప్పుడు పబ్ కల్చర్ కన్నా ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కువైంది. వీకెండ్స్ లో హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఫామ్ హౌస్ లకు వెళ్లి అక్కడ పార్టీలు చేసుకుంటూ చెలరేగిపోతున్న యువత తాట తీస్తుంది తెలంగాణ ఈగల్ టీమ్ .
యూత్ మాత్రమే కాదు సినీ, రాజకీయ ముసుగులో ఉన్న సెలబ్రేటిస్ ఫామ్ హౌస్ లకు వెళ్లి అక్కడ తిని తాగి ఎంజాయ్ చేస్తే ఓకే .. కానీ అక్కడ పార్టీలు చేసుకుని డ్రగ్స్ మత్తులో యువత మునిగితేలుతోంది. ఎన్నిసార్లు పోలీసులకు పట్టుబడినా, ఎన్నిసార్లు న్యూస్ లో హైలెట్ అవుతున్నా ఆ డ్రగ్స్ మత్తు నుంచి యువత బయటపడడం లేదు.
అందుకే హైదరాబాద్ ఈగల్ టీమ్ డేగ కన్ను వేసింది. శని, ఆదివారాల్లో ఫామ్ హౌస్ లపై స్పెషల్ ఫోకస్ పెడుతుంది. ఎక్కడన్నా పార్టీ జరుగుతున్న విషయం తెలిస్తే అక్కడ వాలిపోయి పార్టీలో ఉన్నవారికి డ్రగ్స్ టెస్ట్ లు చేస్తుంది. పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటుంది. అంతేకాదు ఆ న్యూస్ ఛానల్స్ లో వస్తుంది. పరువుపోతుంది.
మరి ఇకనైనా ఫామ్ హౌస్ కల్చర్ నుంచి ఆ డ్రగ్స్ మత్తు నుంచి యువత బయటపడితే ఓకే లేదంటే తెలంగాణ ఈగల్ టీం ఇంకెంత సీరియస్ గా తీసుకుంటుందో అనేది ఊహకి కూడా అందని విషయం. పార్టీ చేసుకోవాలనుకుంటే దొరికిపోయినట్టే జర భద్రం బిడ్డా..!




ధనుష్ తో ఫ్రెండ్ షిప్ పోయింది-విగ్నేష్ 
Loading..