Advertisementt

బాలయ్య కోసం ఆ ఇద్దరు

Sat 28th Mar 2026 09:08 PM
nbk111  బాలయ్య కోసం ఆ ఇద్దరు
NBK 111 update బాలయ్య కోసం ఆ ఇద్దరు
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111(వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. గత పది రోజులుగా హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటున్న NBK 111కి బాలయ్య వల్ల బ్రేకులు పడ్డాయి.

బాలయ్య ఢిల్లీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి వెళ్లడం, అలాగే ఏపీ అసంబ్లీ సమావేశాల కోసం అమరావతికి వెళ్లి ఈరోజు శనివారమే హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. అయితే ఈ చిత్రంలో బాలయ్య తో నయనతార రొమాన్స్ చేయబోతుంది. గతంలో సింహ చిత్రంలోనూ నయన్ బాలయ్య తో కలిసి నటించింది.

ఇప్పుడు ఈ NBK 111 ప్రాజెక్ట్ లోకి మరో హీరోయిన్ ఎంటర్ అవ్వబోతుంది, ఆమె డింపుల్ హయ్యతి. ఈమధ్యనే భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో రవితేజ తో రొమాన్స్ చేసిన డింపుల్ హయ్యతి ని బాలయ్య కోసం సెకండ్ హీరోయిన్ గా గోపీచంద్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. సో బాలయ్య తో నయన్, డింపుల్ ఇద్దరూ ఆడిపాడనున్నారన్నమాట. 

NBK 111 update:

Nandamuri Balakrishna

Tags:   NBK111
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ