Advertisementt

ట్రోలర్స్ కు కంటెంట్ ఇస్తున్న హరీష్ శంకర్

Sat 28th Mar 2026 08:22 PM
harish shankar  ట్రోలర్స్ కు కంటెంట్ ఇస్తున్న హరీష్ శంకర్
Harish Shankar providing content to trolls ట్రోలర్స్ కు కంటెంట్ ఇస్తున్న హరీష్ శంకర్
Advertisement
Ads by CJ

మిస్టర్ బచ్చన్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడు, పవన్ కళ్యాణ్ కి భారీ హిట్ ఇస్తాడని చాలామంది నమ్మకంగా ఉన్నారు. కానీ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తోనూ ఆడియన్స్ ను ఫుల్ గా డిజప్పాయింట్ చేసాడు. అంతేకాదు సినిమా హిట్ అంటూ ఇంటర్వ్యూ ఇవ్వడంతో ట్రోల్ అవుతున్నాడు.

కొంతమంది పనిగట్టుకుని ట్రోల్స్ చేస్తే మనమేం చేస్తాం, వారికీ అదే తిండి అంటూ కౌంటర్ వేసినా.. హరీష్ శంకర్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ చూసి ట్రోలర్స్ ఆక్టివ్ అయ్యారు. హరీష్ శంకర్ ట్రోలర్స్ కి కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నాడు. అదేమిటంటే అర్జెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తానంటూ, ఆయన కోసం కథ రెడీ చేస్తున్నాను అన్నాడు.

అకీరా ను డైరెక్ట్ చేస్తారా అని అడగ్గానే.. మెగా హీరోలందరితో సినిమాలు చేశాను. అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పవన్ గారితో రెండు సినిమాలు చేశాను. అఖిరాకి ఇప్పుడు 19-20 ఏళ్లు కాబట్టి ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ నాకు అర్జెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉంది. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను, ఉంటాను కూడా.

నాకు ఊర మాస్ డైరెక్టర్ అనే పేరు ఉంది కాబట్టి.. ఆ కాంప్లిమెంట్‌ని ఎంజాయ్ చేస్తాను. నాలో మాస్ అండ్ క్లాస్ అన్నీ ఉంటాయి. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు ఇలాంటి సినిమా మెగాస్టార్ తో చేయాలని ఉంది. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్, చిరంజీవి గారు కాలర్ ఎగరేసి చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో అని అనడం.. ఇలాంటి మేనరిజం నాకు ఇష్టం. కాబట్టి చిరంజీవి గారితో అలా సినిమా చేయాలని ఉంది.. అంటూ హరీష్ శంకర్ నమ్మకంగా చిరు సినిమాపై చేసిన కామెంట్స్ చూసి మెగా ఫ్యాన్స్ కి కోపమొచ్చేస్తుంది. 

Harish Shankar providing content to trolls:

Harish Shankar hits back at trolls over Ustaad Bhagat Singh

Tags:   HARISH SHANKAR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ