Advertisementt

అలవోకగా T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా

Sun 08th Mar 2026 10:53 PM
world cup  అలవోకగా T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా
T-20 World Cup 2026: India Creates History అలవోకగా T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా
Advertisement
Ads by CJ

2026 T20 వరల్డ్ కప్ ని టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచి ఇండియాకి అద్భుతమైన విజయాన్ని అందించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ పోరులో ఇండియా అలవోకగా గెలిచి క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేలా చేసింది. 

టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. న్యూజిలాండ్ బౌలింగ్ లో ఇండియా బ్యాట్ మెన్స్ రెచ్చిపోయి 256 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఆతర్వాత ఇండియా బౌలర్లు కూడా రెచ్చిపోయారు. న్యూజిలాండ్ ని ఎక్కడికక్కడ కట్టడి చేసారు. 

15 అలాగే 17 వ ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో ఏకంగా మూడు వికెట్స్ పడగొట్టి న్యూజిలాండ్ చేతులెత్తేసేలా చేసాడు. అసలు 10 ఓవర్లు దాటగానే ఇండియా గెలుపు దాదాపు ఖాయమైపోయింది. న్యూజిలాండ్ మొదటి నుంచి పరుగులు రాబట్టడంలో ఎదురీదుతూనే ఉంది. అటు బ్యాటింగ్ పరంగాను, ఇటు బౌలింగ్ లోను ఇండియా అద్భుతంగా రాణించింది.

న్యూజిలాండ్ ఏ రకంగానూ ఇండియా కి పోటీ ఇవ్వలేకపోయింది. ఏడు బాల్స్ మిగిలి ఉండగానే 159 పరుగుల వద్ద పది వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ఆల్ అవుట్ అయ్యి ఇండియా కి విజయాన్ని అందించింది. ఇండియా బ్యాట్ మెన్స్, బౌలర్లు ఇద్దరూ సమానంగా రాణించి ఇండియాకి 2026 T20 వరల్డ్ కప్ ని అందించారు. T20 వరల్డ్ కప్ ఇండియా గెలవడంతో ఇండియా క్రికెట్ లవర్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారు. 

T-20 World Cup 2026: India Creates History:

India wins T-20 World Cup, crushing New Zealand

Tags:   WORLD CUP
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ