పెళ్ళికి ముందు వరకు ఎలాంటి అనౌన్సమెంట్ లేకుండా అన్ని గుట్టుచప్పుడు కాకుండా చేసుకున్న VIROSH జంట విజయ్ దేవరకొండ-రష్మిక లు పెళ్లి విషయాన్ని ఒకేసారి అనౌన్స్ చేసారు. ఫిబ్రవరి 26 న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం, మార్చ్ 4 న హైదరాబాద్ లో రిసెప్షన్ అని.
మార్చ్ 4 న హైదరాబాద్ లో జరగబోయే వెడ్డింగ్ రిసెప్షన్ కి పీఎం మోడీ దగ్గరనుంచి హోమ్ మినిష్టర్ అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకు విజయ్ దేవరకొండ-రష్మిక పర్సనల్ గా వెళ్లి వారిని ఆహ్వానించారు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ-రష్మిక లు అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కి హాజరవడం, తర్వాత విజయ్ స్వగ్రామం లో వ్రతం చెయ్యడం ఇవన్నీ చూసాం.
ఇక మీడియా నుంచి ఎప్పుడు తప్పించుకునే ఈ జంట మీడియా కోసం హైదరాబాద్ లో మార్చ్ 4 మధ్యాన్నం స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసారు. హైదరాబాద్ లోని FNCC లో మీడియా కి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. మీడియా మిత్రులను ఈ లంచ్ కి ఆహ్వానించి కొత్త జంట విజయ్-రష్మిక లు కాసేపు మీడియా వారితో ముచ్చటిస్తారని తెలుస్తుంది.
ఆ తర్వాత మార్చి 4 సాయంత్రం తాజ్ కృష్ణ లో VIROSH వెడ్డింగ్ రిసెప్షన్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.




విశ్వంభర-ఉగాది వరకు ఓపిక పట్టండి 

Loading..