Advertisementt

విశ్వంభర-ఉగాది వరకు ఓపిక పట్టండి

Tue 03rd Mar 2026 07:16 PM
vishwambhara  విశ్వంభర-ఉగాది వరకు ఓపిక పట్టండి
Vishwambhara Ugadi Treat విశ్వంభర-ఉగాది వరకు ఓపిక పట్టండి
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి - వసిష్ఠ ల కలయికలో ఎప్పుడో మొదలైన విశ్వంభర గత ఏడాదే విడుదల కావాల్సి ఉండగా.. సీజీ వర్క్ కంప్లైంట్ తో సినిమా ఏడాది కాలంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఈ ఏప్రిల్ లో విశ్వంభర విడుదల అన్నా మేకర్స్ సైలెంట్ గా  ఉండడం మెగా అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.

విశ్వంభర టీజర్ పై వచ్చిన ట్రోల్స్, ఫస్ట్ సింగిల్ అంతగా లేకపోవడంతో వసిష్ఠ విశ్వంభర సీజ్ వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు. అందుకే సినిమా విడుదల పోస్ట్ పోన్ లోనే ఉంది. జూన్ లేదా జులై అని మెగాస్టార్ చెప్పినా. మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. దానితో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.

అయితే ఉగాది రోజున విశ్వంభర విషయం తేల్చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా సినిమా విడుదల తేదీ వదిలి.. ఆతర్వాత నుంచి విశ్వంభర ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో మొదలు పెట్టేలా వసిష్ఠ ప్లాన్ చేస్తున్నాడనే వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి చిరు ఈలోపే దర్శకుడు బాబీ తో మెగా 158 మొదలు పెట్టె ఛాన్స్ లేకపోలేదు. 

Vishwambhara Ugadi Treat:

Vishwambhara update

Tags:   VISHWAMBHARA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ