Advertisementt

పటానీతో ల‌వ్ క‌న్ఫామ్ చేసిన గాయ‌కుడు

Fri 06th Feb 2026 05:40 PM
disha patani  పటానీతో ల‌వ్ క‌న్ఫామ్ చేసిన గాయ‌కుడు
Talwiinder addresses viral video with Disha Patani పటానీతో ల‌వ్ క‌న్ఫామ్ చేసిన గాయ‌కుడు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ- పంజాబీ సింగర్ తల్విందర్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు తల్విందర్ నోరు విప్పారు. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. పాపుల‌ర్ వెబ్ సైట్ తో మాట్లాడుతూ.. నూపుర్ స‌న‌న్ పెళ్లికి కొద్దిరోజుల ముందు మా మ‌ధ్య ప‌రిచ‌యం మొద‌లైంది. మీడియా మాపై ఒక్క‌సారిగా ఇంత ఫోక‌స్ చేస్తుంద‌నేది మేం ఊహించ‌లేదు! అని అన్నారు.

ప్రస్తుతం మేం ఒకరి గురించి ఒకరం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం.. పుకార్లను పుకార్లుగానే ఉండనివ్వండి. ఒత్తిడికి లోనై మేం ఏదీ ఇప్పుడే స్పష్టం చేయాలని అనుకోవడం లేదు... అని చెప్పాడు. నేను ప్రతిరోజూ ప్రేమిస్తూనే ఉంటాను. నిజానికి ప్రస్తుతం కూడా నేను ప్రేమలో ఉన్నాను! అని చెబుతూ దిశాతో రిలేషన్‌పై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు.

ఉదయ్‌పూర్‌లో జరిగిన నుపుర్ సనన్ - స్టెబిన్ బెన్ వివాహ వేడుకల్లో వీరిద్దరూ సన్నిహితంగా మెలిగిన వీడియోలు వైరల్ అయ్యాయి. అక్కడే తల్విందర్ తన ఫేస్ మాస్క్ లేకుండా కనిపించడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ముంబైలో జరిగిన లోలపాలూజా మ్యూజిక్ ఫెస్టివల్‌లో వీరిద్దరూ బహిరంగంగా చేతులు పట్టుకుని నడుస్తూ కనిపించడంతో, తమ బంధాన్ని  అధికారికం చేసేశారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దిశాప‌టానీ తెలుగులో లోఫ‌ర్, క‌ల్కి 2898 ఏడి చిత్రాల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం షాహిద్ స‌ర‌స‌న ఓ రోమియో చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Talwiinder addresses viral video with Disha Patani:

After Viral Video With Rumoured Girlfriend Disha Patani Reveals His Face

Tags:   DISHA PATANI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ