బాలీవుడ్ డైరెక్టర్ అనీస్ బజ్మీ ఎట్టకేలకు `నో ఎంట్రీ` సీక్వెల్‌కు సంబంధించి జరుగుతున్న ఆలస్యంపై స్పందించారు. ఈ సినిమా ఆగిపోలేదని కచ్చితంగా పట్టాలెక్కించే ప్రాజెక్ట్ గా వెల్లడించారు. మరి ఇంత కాలం ఏ కారణంగా డిలే అవుతుంది? అంటే సరైన సమాధానం లేని నేపథ్యలో దానిపైనా అనీస్ స్పందించారు.
అవేంటో ఆయన మాటల్లోనే... `ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా చివరి నిమిషంలో నటీనటుల మధ్య తలెత్తిన కొన్ని సమస్యల కారణంగా ప్రాజెక్ట్ నిలిచిపోయిందని తెలిపారు. స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని, విన్నవా రందరూ మెచ్చుకున్నారని స్పష్టం చేశారు. ఈ ఆలస్యానికి క్రియేటివ్ పరమైన ఇబ్బందులు కారణం కాదని, కేవలం కాస్టింగ్ సమస్యలే కారణమని వెల్లడించారు.
ఈ సందర్భంగా మొదటి భాగంలో సల్మాన్ ఖాన్‌తో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సల్మాన్ వరుస ఫ్లాపులతో గడ్డు కాలాన్ని ఎదుర్కున్నారని అనీస్ గుర్తు చేసారు. `నో ఎంట్రీ`, `వాంటెడ్` లాంటి విజయాలు మాత్రమే సల్మాన్ ఖాన్ ని మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసాయన్నారు.
అలాగే సల్మాన్ ఖాన్ తో మళ్ళీ పని చేయాలని తనకు ఉందని అనీష్ మరోసారి ఓపెన్ అయ్యారు. ఒకటి రెండు సినిమాలు సరిగ్గా ఆడనంత మాత్రాన సూపర్ స్టార్ ఇమేజ్ తగ్గిపోదని, ఒక బలమైన సినిమా పడితే సల్మాన్ రేంజ్ మళ్లీ మారుతుందని అనీష్ ధీమా వ్యక్తం చేసారు. అయితే ఈ విషయం తెలిసిన నెటి జనులు సీక్వెల్ లో కూడా సల్మాన్ ఖాన్ ని తీసుకోవాలని కోరుతున్నారు. కొత్త వారి కంటే పాత టీమ్ అయితేనే బాగుంటుందని అభి ప్రాయపడుతున్నారు.





అందుకే సినిమాలకు దూరంగా!
Loading..