మలయాళ నటి భావన నటించిన `అనోమీ` త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అన్ని యూట్యూబ్ ఛానళ్లను అమ్మడు చుట్టేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇవ్వడం, విరామంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో మలయాళ సినిమాలకు దూరంగా ఉండాలని అకస్మాత్తుగా అనిపించి తీసుకున్న నిర్ణమంది.
ఆషిక్ అబు, పృథ్వీరాజ్ వంటి దర్శకులు సినిమా ఆఫర్లతో తనను సంప్రదించి నప్పటికీ, తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని వెల్లడించారు. అలాగే మెగాస్టార్ మమ్ముట్టి సినిమాలో నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నట్లు తెలిపారు. అయితే ఆ ప్రాజెక్టులను ఎందుకు వద్దనుకున్నానో చెప్పడానికి నిర్దిష్టమైన కారణం లేదని భావన అన్నారు. అదొక వింత దశ అని, అప్పుడు మలయాళ సినిమాలతో తాను సంబంధం తెంచుకున్నట్లు అనిపించిందన్నారు.
ఆ సమయంలోనే మలయాళానికి దూరంగా కన్నడ సినిమాల్లో నటించానని వెల్లడించారు. 2023లో `న్తికాక్కక్కోరు ప్రేమొండార్న్` భాన మళ్లీ మలయాళంలోకి మళ్ళీ అడుగుపెట్టారు. నిజానికి ఈ సినిమాను కూడా మొదట వద్దనుకుంది. కానీ దర్శకుడు ఆదిల్ మైమూనాత్ చెప్పిన కథ నచ్చడంతో..మళ్లీ ఇలాంటి కథ దొరకదు అన్న కారణంగా కన్విన్స్ అయింది. ఇటీవల భావన నటించిన `నడికర్`, `హంట్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో అమ్మడి ఆశలన్నీ అనోమీపైనే పెట్టుకుంది.





రష్మిక-విజయ్ పెళ్లి పనులు మొదలైపోయాయ్
Loading..