సౌత్ లో అందులోను తెలుగులో అపజయాలతో దున్నేసిన క్యూట్ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు నార్త్ మరియు కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. నార్త్ లో కార్తీక్ ఆర్యన్ తో నటించిన మూవీ ఇంకా విడుదల కాకూండానే అమ్మడుకి అక్కడ ఆఫర్స్ వచ్చిపెడుతున్నాయి. మరోపక్క మాస్ జాతర ప్లాప్ తో టాలీవుడ్ ఇయర్ ఎండ్ కి బై చెప్పిన శ్రీలీల కోలీవుడ్ లో 2026 కి పరాశక్తి తో వెల్ కమ్ చెప్పింది.
పొంగల్ బరిలో విడుదల అంటూ మేకర్స్, పరాశక్తి కి సెన్సార్ సర్టీఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ బోర్డు సస్పెన్స్ క్రియేట్ చేసాయి. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా, జయం రవి విలన్ గా నటించిన పరాశక్తి అన్ని అడ్డంకులు అధిగమించి ఫైనల్లీ తమిళనాట విడుదలైంది. ఇక పొంగల్ బరిలో ఉండాల్సిన విజయ్ జన నాయకన్ పోస్ట్ పోన్ పరాశక్తి కి కలిసొచ్చింది.
కానీ పరాశక్తి రెస్పాన్స్ ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అమరన్ తో సత్తా చాటిన శివ కార్తికేయన్ పరాశక్తి మూవీకి అంతగా ఓపెనింగ్స్ కూడా లేవు. శివకార్తీకేయన్ పర్ఫార్మెన్స్ బాగుంది. సాంగ్స్ బావున్నాయి. కామెడీ, కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పరాశక్తిలో నిజాయితీతో కూడిన ఉద్దేశాలు ఉన్నప్పటికీ, మీ సహనాన్ని పరీక్షించే, విసుగు పుట్టించే, సుదీర్ఘమైన కథనంతో కూడిన చారిత్రక చిత్రం.
శివకార్తికేయన్, అథర్వ మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. రవి మోహన్ విలన్ గా భయపెట్టారు, శ్రీలీల తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించింది. అయితే సినిమా కథనం నెమ్మదిగా సాగడం ప్రధాన మైనస్ అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ చాలా లెంగ్త్ గా ఉండటం, కొన్ని చోట్ల డాక్యుమెంటరీలా అనిపించడం ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టించిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మరి శ్రీలీల కు తమిళ డెబ్యూ ఎలాంటి రిజల్ట్ అందించిందో పరాశక్తి రివ్యూస్ చూస్తే క్లియర్ గా అర్ధమైపోతుంది.




రాజాసాబ్ - ప్లానింగ్ ప్రకారమే జరిగిందా 
Loading..