రాజాసాబ్ కి డివైడ్ టాక్ వస్తుంది అని దర్శకుడు మారుతి కి ముందే తెలుసా, తెలిసే మారుతి ప్లానింగ్ ప్రకారం ముందే ప్రభాస్ ఓల్డేజ్ కేరెక్టర్ ని యాడ్ చెయ్యకుండా రెండోరోజు రిపీటెడ్ ఆడియన్స్ కోసం ఆ సీన్స్ ని యాడ్ చేసే ప్లాన్ చేసారా, దర్శకుడు మారుతి కి డౌట్ ఉండే ఇలా చేసారా కలెక్షన్స్ కోసమే ఆ ఓల్డేజ్ సీన్స్ ని ముందు విడుదల చెయ్యకుండా దాచేసారా ఇదే ఇప్పుడు కొంతమంది ఆడియన్స్ లో మెదులుతున్న ప్రశ్న. మారుతి చాలా తెలివైనవాడు, అందుకే ఇలా చేసాడు.
కారణం రాజసాబ్ లో కీలకమైన, అభిమానులు విజిల్స్ వేసే సీన్స్ ని మొదటిరోజు కాకుండా రెండో రోజు యాడ్ చెయ్యడం పట్ల అలా పై విధంగా పలువురు సాధారణ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ప్రీమియర్స్ చూసిన వారు ట్రైలర్ లో చూసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ మిస్ అవడంపై తీవ్రమైన విమర్శలు రావడంతో మారుతి హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టిఅనౌన్స్ మరీ రెండోరోజే ఆ సీన్స్ ని యాడ్ చేసారు.
యాడ్ చేసిన సీన్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాదు అసలు ఆ ఎపిసోడ్ ని మొదటిరోజు ఎలా, ఎందుకు మిస్ చేయాలనిపించింది మారుతి అంటూ తిట్టిపోస్తున్నారు. అసలే మన శంకర వరప్రసాద్ గారు కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఈరోజు నుంచి రాజసాబ్ పరిస్థితి ఏమిటో దిక్కుతోచక అభిమానులు ఫుల్ టెన్షన్ మోడ్ లో ఉన్నారు.




అనిల్ రావిపూడి - 9 విజయాలు
Loading..