అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరు నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12 సోమవారం విడుదల కాబోతుంది. అంటే ఈరోజు రాత్రి 8 గంటల నుంచే మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్స్ హడావిడి మొదలు కాబోతుంది. భోళా శంకర్ తర్వాత రావాల్సిన విశ్వంభర ను దాటుకుని వస్తున్న సినిమా కావడం, అనిల్ రావిపూడి పై నమ్మకంతో ఈ సినిమాపై మంచి ఆసక్తి ఉంది.
ఈరోజు నైట్ ప్రీమియర్స్ తోనే మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్ లు కొల్లగొట్టేలా మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. అటు మెగా ఫ్యాన్స్ ఇటు వెంకీ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈరోజు నైట్ వెయ్యబోయే మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్స్ కోసం వెయిటింగ్, వెంకటేష్ చిరు మన శంకర వరప్రసాద్ గారులో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
నయనతార హీరోయిన్.. మరి అనిల్ రావిపూడి అంటే హిట్ మిషన్.. అలా మెగాస్టార్ ఖాతా లో మన శంకర వరప్రసాద్ గారు హిట్ పడడం ఖాయమనే హోప్స్ తో మెగా ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. మరికొన్ని గంటల్లో మన శంకర వరప్రసాద్ గారు అసలు మేటర్ ఏమిటో తేలిపోతుంది.




సంక్రాంతి రిలీజెస్ - ఒక ముచ్చట ముగిసింది
Loading..