మరికొన్ని గంటల్లో విడుదలకు రెడీ అయిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి ఏపీలో ప్రీమియర్స్ కి, టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చెయ్యగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా మన శంకర వరప్రసాద్ గారు కి టికెట్ రేట్లు పెంచుకోవడానికి కాకుండా రేపు ఆదివారం సాయంత్రం నుంచే ప్రీమియర్స్ కి అనుమతులు జారీ చేసింది.
అయితే రాజసాబ్ విషయంలో తెలంగాణ సర్కార్ టికెట్ రేట్ల హైక్ విషయంలో మేకర్స్ ని ఇబ్బంది పెట్టింది, కానీ మన శంకర వప్రసాద్ గారు కి మాత్రం రెండు రోజుల ముందు టికెట్ రేట్ల హైక్ ఇవ్వడమే కాదు, ప్రీమియర్స్ కి అనుమతులు ఇచ్చింది, రాజసాబ్ కి ప్రీమియర్స్ కి అనుమతులు రాక ప్రీమియర్స్ విషయంలో రాజాసాబ్ మేకర్స్ నష్టపోయారు, దానికో న్యాయం దీనికో న్యాయమా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఏసుకుంటున్నారు.
అయితే రాజసాబ్ టికెట్ రేట్ల హైక్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు, టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదు అని పిటిషన్ వేస్తె కోర్టు ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదు, ఇచ్చాక కూడా హై కోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది, అదే సమయంలో మన శంకర వరప్రసాద్ రేట్లు పెంపు ఎలా సాధ్యమైంది.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే వరప్రసాద్ కి పెంచిన టికెట్ రేట్లపై కూడా కేసు వెయ్యగా తెలంగాణ హై కోర్టు ప్రస్తుతం సెలవలు కారణంగా తీర్పు ని రిజర్వ్ చేసింది. దానితో శంకరవరప్రసాద్ బ్రతికిపోయాడు, ఈలోపు సినిమా విడుదలవుతుంది. ఓ వారం తిరుగలేకుండా పెరిగిన టికెట్ రేట్లతో నిర్మాతలు హ్యాపీ.




పొంగల్ రేస్ లో జన నాయకన్-వా వాతియార్ 
Loading..