కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఈఏడాది పొంగల్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. అదేదో సినిమాల విడుదల విషయంలో కాదు , సెన్సార్ బోర్డు భారీ బడ్జెట్ సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో పొంగల్ రిలీజ్ అన్న మేకర్స్ చివరి నిమిషంలో సినిమాలు వాయిదా వేశారు. అందులో డిసెంబర్ 12 న విడుదల కావాల్సిన కార్తీ వా వాతియార్.
నిన్న జనవరి 9 న విడుదల కావాల్సిన విజయ్ జన నాయకన్ చిత్రం, ఈ పొంగల్ బరిలోనే ఉన్న శివకార్తికేయన్ పరాశక్తి సినిమాలు సెన్సార్ కారణాలతో చివరి నిమిషంలో వాయిదాలు పడ్డాయి. కార్తీ వా వాతియార్ కి అయితే భారీ ప్రమోషన్స్ చేసారు. విజయ్ చివరి సినిమా కావడంతో జన నాయకన్ పరిస్థితి అదే. మరోపక్క శివకార్తికేయన్ పరాశక్తి చిక్కులు వదిలించుకుని విడుదలయ్యింది.
అయితే ఇప్పుడు కార్తీ సినిమా వా వాతియార్, విజయ్ జన నాయకన్ చిత్రాలు సడన్ గా పొంగల్ రేస్ లోకి వచ్చేసాయి. అందులో విజయ్ జన నాయకన్ జనవరి 15 న సంక్రాంతి స్పెషల్ గా విడుదలకాబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. ఇక కార్తీ సినిమాకి కూడా మేకర్స్ డేట్ అనౌన్స్ చేసారు.
డిసెంబర్ 12 న విడుదల కావాల్సిన కార్తీ వా వాతియార్ ని జనవరి 14 న విడుదల అవుతున్నట్లుగా ప్రకటించారు. అయితే కార్తీ సినిమా అదే రోజు తెలుగులో విడుదల ఉంటుందా, లేదా అనే అనుమానం ఉంది.




పాన్ ఇండియా కింగ్-రీజనల్ కింగ్ 
Loading..