ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం (AA 22) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారతీయ సినీచరిత్రలో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో తెరకెక్కుతోందని కథనాలొస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల నటి దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఓ కీలక పాత్రను పోషిస్తుందని ఇంతకుముందు గుసగుసలు వినిపించాయి.
అయితే మృణాల్ కి ఎలాంటి పాత్రను ఆఫర్ చేసారనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త సంవత్సరం వేళ మృణాల్ దీనిపై హింట్ ఇస్తుందని భావించినా ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా ఉంది. అట్లీ బృందం నుంచి కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
ఇక 2026లో మృణాల్ అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అడివి శేష్ సరసన నటించిన డకాయిట్ మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో సిద్ధాంత్ చతుర్వేది, వరుణ్ ధావన్ లాంటి ట్యాలెంటెడ్ స్టార్ల సరసన నటిస్తోంది. ఈ సినిమాలు 2026 ప్రథమార్థంలో విడుదలవుతాయి. హ్యూమా ఖురేషితో కలిసి మరో ప్రాజెక్టులో బిజీగా ఉంది. ఇక ఇయర్ ఎండ్ పార్టీని తన స్నేహితురాలు తమన్నాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న మృణాల్ కొత్త సంవత్సరంలో తన తదుపరి షెడ్యూళ్ల గురించి వెల్లడించాల్సి ఉంది.
సీతారామం, హాయ్ నాన్న లాంటి క్లాసిక్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రజల మనసులు గెలుచుకున్న మృణాల్ కి ఈ ఏడాది డెకాయిట్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందించాలని ఆకాంక్షిద్దాం.




MSG ట్రైలర్ - మిక్స్డ్ రెస్పాన్స్ 
Loading..