తనూజ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఆమెపై సీరియల్ నటులు, బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకునే వాళ్ళు చాలామంది విషం కక్కడమే కాదు ఆమెను బ్యాడ్ చేసేందుకు నానారకాల తంటాలు పడ్డారు. తనూజ తో కలిసి పని చేసిన శ్రీ సత్య అయితే తనూజ కి సపోర్ట్ చెయ్యకపోయినా కళ్యాణ్ పడాల కు సపోర్ట్ చేసింది.
అంతవరకు బాగానే ఉంది, తనూజాకు సపోర్ట్ ఎందుకు చెయ్యరు అంటే తనూజ గురించి మీకు తెలుసా ఆమె గురించి నాకు తెలుసు అంటూ తనుజను నెగెటివ్ చేసే ప్రయత్నం చేసింది. అంతకముందు పూల్ లో యష్మి తో కలిసి ముద్ద మందారం పూలు చెవిలో అంటూ తనూజ కు ఎగైనెస్ట్ గా వీడియో చేసింది. కన్నడ నటి అయిన యష్మి తనూజ రెండో ప్లేస్ లో ఉంటుందేమో అంటూనే కళ్యాణ్ పడాల కు సపోర్ట్ చేసింది.
ఇక బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకునే గీతూ కన్నడ అభిమానులు, తనూజ అభిమానుల వల్ల హార్ట్ అయ్యి తనూజ ని వదిలేసి కళ్యాణ్ పడాల కు సపోర్ట్ చేసారు. అయితే హౌస్ నుంచి బయటికొచ్చిన తనూజ ఇన్స్టా లైవ్ లో ఉన్నప్పుడు మీ పై శ్రీసత్య, యష్మి లాంటి వాళ్ళు నెగెటివ్ ప్రచారం చేశారు. దానికి మీరేం అంటారు అని అడిగితే..
నేను ప్రేక్షకులకు నచ్చాను, అందరికి నచ్చాలని లేదు, ఎవరి మనసుల్లో ఏముంటుంది, ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి, అందులో అందరికి నచ్చాలని రూల్ లేదు. ఇంతమంది లవ్, సపోర్ట్ ఉండగా ఎక్కడో ఒక చిన్న డాట్ ని పట్టించుకుంటానా నేను, ఫైనల్ గా నేను ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో అనేది పక్కనపెట్టి ఇక్కడ ఇంతమందిని ప్రేమను సంపాదించుకోవడం చాలు నాకు అంటూ తనూజ శ్రీసత్య, యష్మి, గీతు ల విషయాన్ని చాలా లైట్ తీసుకుంది.




మొదటిరోజు గట్టిగా కొట్టిన ఛాంపియన్
Loading..