నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక నటించిన లేటెస్ట్ చిత్రం ఛాంపియన్ నిన్న క్రిష్టమస్ స్పెషల్ గా విడుదలైంది. స్వప్న సినిమాస్ లాంటి బిగ్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు, అటు ఛాంపియన్ పోస్టర్స్, ట్రైలర్ అన్ని ఈ చిత్రం పై అంచనాలను క్రియేట్ చెయ్యడంలో కీలక పాత్ర పోషించాయి.
ఇక నిన్న విడుదలైన ఛాంపియన్ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా మొదటి రోజు ఛాంపియన్ తో రోషన్ మేక గట్టిగానే పట్టుకొచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఛాంపియన్ మొదటి రోజు రూ. 4.50 కోట్ల షేర్ తీసుకొచ్చినట్టుగా మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసారు.
కుర్ర హీరో రోషన్ యాక్టింగ్ బావుంది, ఫస్ట్ హాఫ్ బావుంది. వార్ సీక్వెన్స్, BGM, సినిమాటోగ్రఫీ ఛాంపియన్ కి ప్లస్ పాయింట్స్ గా నిలవగా.. సెకండ్ హాఫ్, స్లో నేరేషన్, వీక్ కేరెక్టరైజేషన్, క్లైమాక్స్ సినిమాకి మైనస్ గా అయ్యింది. అందుకే ఛాంపియన్ జస్ట్ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.




మోహన్ లాల్ సినిమాకి ఇలాంటి టాకా
Loading..