అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో AA 22 ప్రాజెక్ట్ ని ఇంటర్నేషనల్ లెవల్లో చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చిత్రీకరణలో బిజీగా వుంది. అయితే అల్లు అర్జున్ పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో మూవీ అనౌన్స్ చేశారు. కానీ త్రివిక్రమ్ ని పక్కనపెట్టి బన్నీ అట్లీ తో మూవ్ అయ్యాడు.
అయితే అట్లీ తర్వాత అల్లు అర్జున్ చెయ్యబోయే మూవీపై, అలాగే ఆయన నెక్స్ట్ డైరెక్టర్ పై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. తాజాగా గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ AA 22 తర్వాత రెండు ప్రాజెక్ట్స్ లాక్ అయ్యాయి. వాటిని జనవరి లో ఎనౌన్స్ చేస్తాం.. ఒకటి వచ్చే ఏడాది జులై లేదా ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
అల్లు అర్జున్ మరొక ప్రాజెక్ట్ 2027 లో స్టార్ట్ అవ్వనుంది అంటూ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై బన్నీ వాస్ క్రేజీ అప్ డేట్ అందించారు. ఇక అట్లీ తో అల్లు అర్జున్ చేస్తున్న ప్రాజెక్ట్ లో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.




భర్తకి వాసన చూపించిన పీసీ!
Loading..