Advertisementt

ఇప్పటికైనా కళ్ళు తెరవండి

Wed 29th Apr 2026 04:06 PM
big boss  ఇప్పటికైనా కళ్ళు తెరవండి
Big Boss A chance But Not A change ఇప్పటికైనా కళ్ళు తెరవండి
Advertisement
Ads by CJ

 

బిగ్ బాస్ ట్రోఫీ గెలిస్తే హీరోలైపోతాం, బిగ్ బాస్ కి వెళితే వెండితెర పై వెలిగిపోవచ్చు, బిగ్ బాస్ గెలిస్తే క్రేజ్ వచ్చేస్తుంది, ఫేమ్ వచ్చేస్తుంది అనే భ్రమ నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం బిగ్ బాస్ సీజన్స్ కి విన్నర్స్ గా నిలిచిన తొమ్మిదిమందిని చూసాక, వాళ్ళేం చేస్తున్నారో చూసాక బిగ్ బాస్ కి వెళ్లాలనే ఆసక్తిని చంపుకుంటారు.

నిన్నగాక మొన్న బిగ్ బాస్ నైన్ విన్నర్ గా నిలిచిన సోల్జర్ కళ్యాణ్ పడాల నటుడిగా మారాలనే తపన తో తన ఆర్మీ జాబ్ వదులుకున్నాడు. బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఓ నెల రోజుల పాటు షాప్ ఓపెనింగ్స్, రిబ్బన్ కటింగ్స్ అంటూ తెగ హడావిడి చేసాడు. ఆతర్వాత కళ్యాణ్ నటుడిగా బిజీ అవుదామనుకున్నాడు. కానీ ఫలితం సూన్యం.

దానితో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాడు. ఇప్పుడు స్టార్ మా కూకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అంతే తప్ప కళ్యాణ్ బిగ్ బాస్ ట్రోఫీ గెలవడం వల్ల అతనికి ఒరిగింది ఏమి లేదు. బిగ్ బాస్ కి వెళ్లినందుకు వచ్చిన రెమ్యునరేషన్ తప్ప. మరి ఇప్పటికైనా వెర్రి జనాలు కళ్ళు తెరిస్తే బెటర్. 

Big Boss A chance But Not A change :

Can Big Boss Change Your Life

Tags:   BIG BOSS
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ