Advertisementt

CBN బ్రాండ్ తోనే ఇన్వెస్టర్ల రాక-నారా లోకేష్

Tue 28th Apr 2026 03:11 PM
nara lokesh  CBN బ్రాండ్ తోనే ఇన్వెస్టర్ల రాక-నారా లోకేష్
Entire world looking at Andhra due to Brand CBN says Nara Lokesh CBN బ్రాండ్ తోనే ఇన్వెస్టర్ల రాక-నారా లోకేష్
Advertisement
Ads by CJ

గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుకు మంగళవారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్ పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. 

CBN బ్రాండ్ తోనే ఇన్వెస్టర్ల రాక

నిన్నటి వరకు ఇన్వెస్టర్లు అడిగిన మాట మేము ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు రావాలి అని. ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న మూడు యూనిక్ పాయింట్ల గురించి వాళ్లకు చెప్పాను. మొదటి ది బ్రాండ్ సీబీఎన్. ప్రపంచంలో ఏ కంపెనీ వద్దకు వెళ్లి నా మన బ్రాండ్ సీబీఎన్ పేరు చెప్పగానే డోర్స్ ఓపెన్ అవుతాయి. సైబరాబాద్ కట్టిన హిస్టరీ మన బ్రాండ్‌కి ఉంది. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి గేర్ మార్చాం. మూడవది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. అది సీబీఎన్ బ్రాండ్ సత్తా.

గూగుల్ స్టోరీ సెప్టెంబర్ 2024 లో ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే గూగుల్ ప్రతినిధులతో ఇదే విశాఖపట్నంలో మొదటి మీటింగ్ జరిగింది. ఆరోజు జరిగిన మీటింగ్ ఫలితం ఈ రోజు ఒక డేటా సిటీ. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన ప్రతి కంపెనీ వెనుక ఒక కథ ఉంది. తీసుకొచ్చిన ప్రతి కంపెనీ వెనుక కష్టం ఉంది. ఇటీవల ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టు వచ్చింది. ఆ రోజు వాళ్లు ఒక క్లియర్ విజన్‌తో వచ్చారు. మూడు అంశాల్లో క్లారిటీ కావాలని అడిగారు. ఆరోజు వాళ్లు అడిగిన మూడు అంశాలను మనం ఒక మిషన్ మోడ్‌లో తీసుకున్నాం. 13 నెలలు పరుగులు పెట్టాం. వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ప్రతి రోజు ఫాలో అప్ చేశాం.

సీఎం చంద్రబాబు నేరుగా పర్యవేక్షించారు

విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ సహకరించారు. ముఖ్యమంత్రి నేరుగా మానిటర్ చేశారు. పాలసీ లో మార్పులు కావాలంటే కేంద్రాన్ని ఒప్పించి చేయించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇందుకు సహకరించారు.13 నెలల కష్టం తరువాత అక్టోబర్ 2025 న ఢిల్లీలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాం. సీఎం 12 నెలల టార్గెట్ ఇస్తే 13 నెలల్లో పూర్తి చేశాం. ఆయనను సంతృప్తి పరచాలంటే మేము ఇంకా స్పీడ్ పెంచాలి. ఆయన 25 ఏళ్ల కుర్రాడిలా పరిగెడతారు. మేము ఆయన వెనుక పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాం.. అంటూ నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడారు.

Entire world looking at Andhra due to Brand CBN says Nara Lokesh:

Nara Lokesh - AI Data Centre

Tags:   NARA LOKESH
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ