Advertisementt

వార్ ప్ర‌భావంతో బ‌డ్జెట్ త‌డిసి మోపెడే

Thu 19th Mar 2026 09:49 AM
war effect  వార్ ప్ర‌భావంతో బ‌డ్జెట్ త‌డిసి మోపెడే
War effect on Telugu movies వార్ ప్ర‌భావంతో బ‌డ్జెట్ త‌డిసి మోపెడే
Advertisement
Ads by CJ

 

 

ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు సినిమా రంగాన్ని ఊహించని రీతిలో ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ షూటింగ్‌లపై మాత్రమే కాకుండా, స్థానికంగా జరిగే చిత్రీకరణలపై కూడా యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ మరియు చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో, వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది నేరుగా సినిమా నిర్మాణ వ్యయాన్ని పెంచుతూ, నిర్మాతలకు బడ్జెట్ పరంగా తడిసి మోపెడవుతోంది.

షూటింగ్ సెట్లలో వేలాది మందికి భోజన సదుపాయం కల్పించడం ఒక పెద్ద ప్రక్రియ. అయితే, గ్యాస్ కొరత మరియు పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో సెట్లలో అందించే ఫుడ్ మెనూలో కూడా మార్పులు చేయాల్సి వస్తోందని సమాచారం. వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు , ఖర్చులను అదుపు చేసేందుకు చిత్ర యూనిట్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. మెనూలో భారీ మార్పులు చేయడం ద్వారా బడ్జెట్‌ను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అంతిమంగా అది సినిమా మొత్తం వ్యయంపైనే ప్రభావం చూపుతోంది.

ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు పెరిగిన ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు వెరసి చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు అందరికీ సవాలుగా మారాయి. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న పలు క్రేజీ ప్రాజెక్టుల బడ్జెట్లు ప్రాథమిక అంచనాల కంటే 10 నుండి 20 శాతం పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ యుద్ధ మేఘాలు ఎప్పుడు తొలగిపోతాయా అని? మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు? వస్తాయా అని సినీ పరిశ్రమ ఆశగా ఎదురు చూస్తోంది.

War effect on Telugu movies:

War effect on Film Budget

Tags:   WAR EFFECT
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ