Advertisementt

మేకర్స్ వినలేదు..అందుకే ఈ రచ్చ

Thu 19th Mar 2026 08:19 AM
kd the devil song  మేకర్స్ వినలేదు..అందుకే ఈ రచ్చ
Raqueeb Alam on KD The Devil song Controversy మేకర్స్ వినలేదు..అందుకే ఈ రచ్చ
Advertisement
Ads by CJ

ధ్రువ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `కెడీ- ద డెవిల్` లోని `సర్కే చునర్` పాట  దేశవ్యాప్తంగా ఎంత‌టి వివాదాస్పదంగా మారిందో తెలిసిందే.  పాటలోని అభ్యంతరకర సాహిత్యం, నోరా ఫతేహి చేసిన అసభ్యకర డ్యాన్స్ స్టెప్స్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వంటి వారు బాలీవుడ్‌లో పెరుగుతున్న అశ్లీలతపై మండిపడగా, గాయకుడు అర్మాన్ మాలిక్ సైతం కమర్షియల్ సాంగ్స్ ఇంతలా దిగజారిపోవడంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి కారణంగా ఇప్పటికే ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించిన సంగ‌తి తెలిసిందే.

ఈ వివాదంపై హిందీ వెర్షన్ గీత రచయిత రకీబ్ ఆలం స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. తాను కేవలం అనువాదకుడిని మాత్రమేనని, వివాదాస్పద పదాల విషయంలో ముందే మేకర్స్‌ను హెచ్చరించినట్లు  తెలిపారు. కన్నడ నుంచి హిందీలోకి మార్చే క్రమంలో కొన్ని పదాలు ఇబ్బందికరంగా మారుతాయని, సెన్సార్ బోర్డు నుంచి కూడా అభ్యంతరాలు రావచ్చని సూచించినా.. ఒరిజినల్ ఫీల్ పోకూడదనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ తన సలహాను పక్కనబెట్టిందని  స్పష్టం చేశారు. ఈ వివాదానికి తనని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు.

మరోవైపు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని చిత్ర బృందానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. కేవలం సోషల్ మీడియా నిరసనలే కాకుండా, ప్రభుత్వం మరియు సెన్సార్ బోర్డు నుంచి కూడా చర్యలు మొదలవ్వడంతో  కేడీ చిత్ర యూనిట్ ఆందోళనలో పడింది. అశ్లీలతను ప్రోత్సహి స్తున్నారన్న విమర్శల నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ సినిమాపై కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మ‌రి పరిణామాలు  సినిమా బాక్సాఫీస్ ప్రయాణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Raqueeb Alam on KD The Devil song Controversy :

Raqueeb Alam on KD The Devil song

Tags:   KD THE DEVIL SONG
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ