Advertisementt

డైరెక్ట‌ర్ స‌క్సెస్ కోసం హీరోలు వెయిటింగ్

Wed 25th Feb 2026 04:03 PM
puri jagannath  డైరెక్ట‌ర్ స‌క్సెస్ కోసం హీరోలు వెయిటింగ్
Star Heros Waiting For Puri jagannath Success డైరెక్ట‌ర్ స‌క్సెస్ కోసం హీరోలు వెయిటింగ్
Advertisement
Ads by CJ

అభిమాన హీరోలు ప్లాప్ ల్లో ఉన్న‌ప్పుడు త‌మ హీరో స‌క్సస్ తో ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడా? ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. విజ‌యం సాధించాల‌ని దేవుళ్ల‌కు మొక్కుతారు. తిరుప‌తికి కాలిన‌డ‌కన‌ వెళ్తుంటారు. ఇలాంటి అభిమానం హీరోల‌పై స‌గటు ప్రేక్ష‌కుడు చూపించ‌డం స‌హ‌జం. కానీ ఓ డైరెక్ట‌ర్ స‌క్సెస్ కోసం ముగ్గురు బిగ్ స్టార్స్ వెయిట్ చేస్తున్నారు? అన్న‌ది అంత‌కు మించిన ఇంట్రెస్టింగ్.

 

ఎందుకంటే సాధార‌ణంగా ఏ హీరో అయినా తామెంత సేఫ్ జోన్ లో ఉన్నా? ఎలాంటి సినిమాలు చేస్తున్నాం?  భ‌విష్య‌త్ ఎలా ఉంటుందా? అని త‌మ ఆత్రం త‌ప్ప డైరెక్ట‌ర్ల గురించి ప‌ట్టించుకునేంత స‌మ‌యం ఇవ్వ‌రు. కానీ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాద్ స‌క్సెస్ కోసం త‌న అభిమానులు ఎంత ఆశ‌గా ఎదురు చూస్తున్నారో?  ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ అంత‌కు మించి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 

స‌మ‌యం వ‌చ్చిన ప్ర‌తీ సంద‌ర్భంలో  ప్ర‌భాస్,  పూరి ట్యాలెంట్ గురించి ఎంత‌సేపైనా మాట్లాడుతారు. హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ మీద క‌థ రాయ‌గ‌ల ఒకే ఒక్క డైరెక్ట‌ర్ పూరి...ఇండియాలో మ‌రో డైరెక్ట‌ర్ లేడ‌ని అంటారు. అలాంటి డైరెక్ట‌ర్  మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌ని తాను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపాడు.

 

అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా `వార‌ణాసి` ప్ర‌మోష‌న్ లో  భాగంగా అంత‌ర్జాతీయ‌ మీడియాతో `పోకిరి`, `బిజినెస్ మెన్` లాంటి విజ‌యాలు అందించిన పూరి గురించి అంతే గొప్పగా మాట్లాడారు. ఆయ‌న విజ‌యం కోసం తాను కూడా ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ పూరి విజ‌యంతో మ‌ళ్లీ గ‌త వైభ‌వాన్ని అందుకోవాల‌ని..అది తొంద‌ర్లోనే జ‌రుగుతుంద‌ని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. చ‌ర‌ణ్‌...పూరి కి క్లోజ్ గా ఉంటారు. పూరి పెయిన్ చ‌ర‌ణ్ వ‌ద్ద ఓపెన్ గా పంచుకునేంత చ‌నువు ఉంది. 

Star Heros Waiting For Puri jagannath Success:

Puri jagannath Success - Star Heros Waiting 

Tags:   PURI JAGANNATH
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ