Advertisementt

ఆ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా రెజీనా

Mon 23rd Feb 2026 06:45 PM
regina  ఆ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా రెజీనా
Is Regina quit Mollywood Intentionally ఆ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా రెజీనా
Advertisement
Ads by CJ

చెన్నై బ్యూటీ రెజీనా క‌సాండ్రా జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ లో త‌మిళం, తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు చేసింది. హీరోయిన్ గా అనుకున్నంత‌గా స‌క్సెస్ కాన‌ప్ప‌టికీ న‌టిగా మాత్రం ఖాళీగా లేదు. ఏదో భాష‌లో సినిమాలు చేస్తూనే ఉంది. ఈ మ‌ధ్య‌ కాలంలో బాలీవుడ్ చిత్రాల‌పైనా దృష్టి పెట్టింది. అక్క‌డా అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి.

 

అయితే అవ‌న్నీ చిన్నా చితాక సినిమాలు కావ‌డంతో రెజీనా పేరు పెద్ద‌గా వైర‌ల్ అవ్వ‌డం లేదు. ప్ర‌స్తుతం తెలుగులో కూడా సినిమాలు చేయలేదు. త‌మిళం, హిందీ సినిమాల‌తోనే  బిజీగా ఉంది. ఇలా ఇప్ప‌టి వర‌కూ అన్ని భాష‌ల్ని ట‌చ్ చేసింది. కానీ మాలీవుడ్ లో మాత్రం అమ్మ‌డు లాంచ్ అవ్వ‌లేదు. అవును అన్ని ఇండ‌స్ట్రీలో సినిమాలు చేసిన చెన్నై బ్యూటీ మాలీవుడ్ కి మాత్రం దూరంగానే ఉంది.

 

అక్క‌డ క‌నీసం ప్ర‌య‌త్నాలు కూడా చేసిన‌ట్లు క‌నిపించ‌లేదు. మ‌రి ఏ క‌రాణంగా మ‌లీవుడ్ కి దూరంగా ఉంది? అన్న‌ది తెలియాలి. అవ‌కాశాలు రాక ప‌ని చేయ‌లేదా? వ‌చ్చినా త‌నే వ‌ద్ద‌నుకుందా? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అవ‌న్నీ ప‌క్క‌న బెడితే మాలీవుడ్ కూడా ఇప్పుడు క‌మ‌ర్శియ‌ల్ ఇండ‌స్ట్రీగా మారింది.

 

కాన్సెప్ట్ బేస్ట్ చిత్రాల‌తో పాటు క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు కూడా తెర‌కెక్కుతున్నాయి.  హీరోయిన్ గా స‌క్సస్ అయిన వారంతా అక్కడ ఇండ‌స్ట్రీలోనూ న‌టించడానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. స్వీటీ అనుష్క కూడా మాలీవుడ్ లో లాంచ్ అవుతోంది. మ‌రి రెజీనా మాత్రం మాలీవుడ్ కి దూరంగా ఏకార‌ణంగా ఉంటుందో తెలియాలి.   

Is Regina quit Mollywood Intentionally :

Why Regina Standing Away from Mollywood

Tags:   REGINA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ