భారతీయ చలనచిత్ర రంగంలోనే అగ్ర అగ్రశ్రేణి కథానాయకులలో ప్రభాస్ ఒకరు. కానీ డార్లింగ్ తన స్టార్‌డమ్‌ని ఎంత మాత్రం సీరియస్‌గా తీసుకోరు. చాలా సింపుల్ గా ఉంటారు. ఈ నిరాడంబరత ఆయనలో వినమ్రతను చాటిచెప్పినప్పటికీ, వృత్తిపరంగా ఇది ఆయనపై ప్రభావం చూపుతోందని కొంత మంది భావిస్తున్నారు. ప్రభాస్ లో ఈ రిలాక్స్డ్ ధోరణిని అభిమానులు సైతం ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది.
ఈ మధ్య కాలంలో ప్రభాస్ తీసుకుంటున్న సృజనాత్మక నిర్ణయాలు అందరినీ అయోమయానికి గురిచే స్తున్నాయన్నది కాదనలేని నిజం. కొన్ని నిర్ణయాలు వింతగా, సమర్థించుకోలేనివిగా కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయాలే ఆయన సినిమాల నాణ్యతను దెబ్బతీస్తున్నాయని అభిమానులు సందేహిస్తున్నారు. అగ్రశ్రేణి దర్శకులతో కలిసి పని చేయడానికి బదులుగా, ప్రభాస్ ఇంకా నాన్-మెయిన్‌స్ట్రీమ్ దర్శకులతోనే ప్రయోగాలు చేయడం నచ్చడం లేదు.
ప్రయోగాలు చేయడం మంచిదే అయినప్పటికీ, ప్రభాస్ స్థాయికి తగ్గ ప్రయోగామైతే పర్వాలేదు. `ది రాజాసాబ్` లాంటి చెత్త ప్రయోగాలు చేయోద్దు అంటూ హితవు పలుకుతున్నారు. ఒక సినిమా విజయం సాధించాలంటే బలమైన కథ, దర్శకుడు అవసరం. సినిమా అనేది కేవలం హీరో మీద మాత్రమే ఆధారపడితే సరిపోదని, దర్శకుడి పాత్ర కూడా అంతే కీలకమని వారు చెబుతున్నారు. పేరున్న దర్శకులతో పని చేసినప్పుడే? నాణ్యమైన అవుట్‌పుట్ వస్తుందని, లేదంటే వైఫల్యం మొత్తం ప్రభాస్ ఖాతాలోకి వెళ్తుందని ఆందోళన చెందుతున్నారు.
అలాంటి సందర్భాల్లో చిన్న దర్శకులు కోల్పోయేది ఏమీ ఉండదు. అందుకే క్రెడిబిలిటీ ఉన్న, సమర్థులైన దర్శకులతో పనిచేయాలని అభిమానులు కోరుతున్నారు. అప్పుడే దర్శకులు ప్రాజెక్ట్ పట్ల మరింత నిబద్ధతతో, శ్రద్ధతో ఉంటారన్నది వారి అభిప్రాయం. ఈ సమతుల్యత లేకపోతే సినిమాలు దెబ్బతినే అవకాశం ఉంది.
.





ఈ వారం సంక్రాంతి సినిమాల్తో సరిపెట్టుకోండి
Loading..