ఇటీవలే భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయింది. కానీ తొలి షోతోనే డిజాస్టర్ గా తేలిపోయింది. సినిమాకొచ్చిన రివ్యూలు...థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ చూస్తే ఆ సినిమా ఎంత ఘోరంగా ప్లాప్ అయిందో క్లియర్ చెప్పొచ్చు. అనంతరం హీరో పార్ట్ ను అదనంగా యాడ్ చేస్తున్నామంటూ మరో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఇవన్నీ చూస్తేనే సినిమా వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది.
నెట్టింట ట్రోలింగ్ ..ఆ చిత్ర యూనిట్ పై అభిమానులు మండి పడిన తీరు గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఈ ఐదారేళ్ల కాలంలో ఈరేంజ్ లో ఏ సినిమా విమర్శలకు గురి కాలేదు. ట్రోలింగ్ జరగలేదు. చివరికి స్టార్ ఇమేజ్ పై కొందరు కుట్ర పన్నే ఇలాంటి సినిమా చేసారని మండిపడ్డారు. వాళ్ల జేబులు నింపుకోవడం కోసం హీరో ఇమేజ్ ను తాకట్టు పెట్టేసారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంత సీన్ జరిగితే? ఈసినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు నాలుగు రోజుల్లోనే వందల కోట్లు అంటూ వేసిన పోస్టర్ వైరల్ అవుతోంది.
మరి ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాకు వందల కోట్లు వసూళ్లు నిజమేనా? అంటే గతంలో ఓ స్టార్ ప్రోడ్యూసర్ వేసిన అంచనా ప్రకారం చూస్తే? అవన్నీ పక్కా ఫేక్ కలెక్షన్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాలెక్కలు..బొక్కలు మాకుంటాయని అప్పట్లో నిర్మాత చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. తొలి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాకి అనేసి కోట్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. హీరో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా బయటకు చెప్పుకునే కలెక్షన్లు తప్ప అవేవి వాస్తవ వసూళ్లు కాదని అంటున్నారు.




ఈ మాత్రం టాక్ వస్తే సేఫె
Loading..