సంక్రాంతి సీజన్ లో విడుదలైన సినిమాలకు జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు నిర్మాతలు, బయ్యర్లు ఒడ్డున పడిపోతారు. యూత్ మొత్తం కోడి పందేలకు వెళ్ళిపోతే.. ఫ్యామిలీస్ కి మంచి అప్షన్ మాత్రం సినిమానే. అందులోను కామెడీ ఎంటెర్టైనెర్స్, ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ కి సంక్రాంతి సీజన్ లో గిరాకీ ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో రాజసాబ్ ఎలా ఉన్నా మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు తో గట్టిగానే కొట్టారు. ఎక్స్ట్రాడినరీ హిట్ కాకపోయినా పోజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ సినిమా నిర్మాతలకు లాభాలే లాభాలు. 30 నుంచి 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు కి ఈ టాక్ తో రెండు, మూడు వందల కోట్ల క్లబ్బులోకి ఈజీగా వెళ్ళిపోతుంది. .
ఇక కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న రవితేజ కి నిన్న విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి కాస్త ఊరటనిచ్చింది. భర్త మహాశయులకు జస్ట్ యావరేజ్ టాక్ పడింది. అయినప్పటికి ఈ సినిమా కూడా వర్కౌట్ అవ్వడం ఖాయం. కారణం సంక్రాంతి సీజన్ కావడమే. ఈ మాత్రం టాక్ వస్తే సేఫె మరి.
ఇక అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి విషయం తేలాల్సి ఉంది.




10వ సినిమా 50 రోజుల్లో ముగించి బరిలోకి
Loading..