బాహుబలి తర్వాత చాలామంది హీరోలు సీక్వెల్స్ వెంట పరుగులు పెడుతున్నారు. అందులో కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని పార్ట్ 2 షూటింగ్ చెయ్యకుండానే అటకెక్కుతున్నాయి. రీసెంట్ గా నిర్మాత నాగవంశీ కింగ్ డమ్ పార్ట్ 2 లేదనేశారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజసాబ్ సీక్వెల్ ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
గత శుక్రవారం సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన రాజసాబ్ కి నెగెటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. కనీసం రివ్యూ రైటర్స్ కూడా రాజసాబ్ ని పూర్ రేటింగ్స్ ఈ రాజసాబ్ కి వచ్చాయి. మారుతి మేకింగ్ పై విమర్శలు, మారుతి రైటింగ్ పై సెటైర్స్, అబ్బో రాజసాబ్ కి వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ని ఆయన అభిమానులు డిపెండ్ చేసుకోలేక సతమతైపోతున్నారు.
ట్రైలర్ లో చూపించిన కంటెంట్ లేదు అందుకే సినిమా ఎవరికి అర్ధం కాలేదు అంటూ మారుతి సినిమా విడుదలైన నెక్స్ట్ డే కి పెద్ద ప్రభాస్ ని యాడ్ చేసిన సీన్స్ తో రిలీజ్ చేసారు. ఇక ఈరోజు నుంచి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ హావా తో పాటుగా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు, నారి నారి నడుమ మురారి వస్తున్నాయి. వీటి సందడిలో రాజసాబ్ ఏమైపోతుందో అనే టెన్షన్ లో అభిమానులు ఉన్నారు.
మరి ఇలాంటి ఫీడ్ బ్యాక్ ఉన్న రాజసాబ్ కి నిర్మాతలు సీక్వెల్ చేసే ఆలోచన చేస్తారా, రాజసాబ్ పార్ట్ 2 చేసే సాహసం చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో అనేది.




బన్నీ తో అట్లీ ఒకటి కాదు రెండు భాగాలుగా
Loading..