దళపతి విజయ్ సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పి రాజకీయాల్లో తలమునకలవుతున్న సంగతి తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం అతడు తన పార్టీని బలోపేతం దిశగా పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అతడు సమావేశాలు నిర్వహిస్తున్నాడు. విజయ్ స్థాపించిన `తమిళగ వెట్రి కళగం` (టీవీకే) పార్టీ గెలుపే లక్ష్యంగా పోరాటం ప్రారంభించనుంది. దీంతో విజయ్ ఇప్పటికే ప్రజల్లోకి వెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
అయితే ఈ సమయంలో విజయ్ నటించిన జననాయగన్ రిలీజ్ కి సెన్సార్ పరంగా సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టుల పరిధిలో దీనిపై విచారణ సాగుతోంది. ఇలాంటి సమయంలో తమిళ చిత్రసీమ అతడి పక్షాన నిలబడింది. చాలా మంది హీరోలు విజయ్ కి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తున్నారు.
ఇదిలా ఉంటే తుప్పరివాలన్ 2 ప్రమోషన్స్ లో ఉన్న స్టార్ హీరో విశాల్ రాజకీయాలపై తాజా వ్యాఖ్యలు చర్చగా మారాయి. దళపతి విజయ్ రాజకీయాల్లో రాణించాలంటే చాలా శ్రమించాలని, రాజకీయాలు అంత సులువు కాదని విశాల్ వ్యాఖ్యానించారు. డిఎంకే, ఏఐడిఎంకే ఇప్పటికే పాతుకుపోయిన పార్టీలు. వాటిని ఢీకొడుతూ నిలబడటం అంత ఈజీ కాదని అన్నాడు. విజయ్ క్షేత్రస్థాయిలో చాలా కృషి చేయాల్సి ఉంటుందని, పార్టీని బలోపేతం చేయాలని కూడా విశాల్ సూచించాడు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా అతడు హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం టీవీకే పార్టీ ఎలా నడుస్తోందో పరిశీలిస్తున్నానని, సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పాడు.




అలా వరప్రసాద్ కి కలిసొచ్చింది 
Loading..