బిగ్ బాస్ 9 లోకి కమెడియన్ గా ఎంటర్ అయిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హౌస్ లో అందరితో కలుపుగోలుగా ఉంటూనే తనూజ, రీతూ లతో సరదాగా కామెడీ చేస్తూ.. హౌస్ ని ఎంటర్టైన్ చేస్తూ టాస్క్ ల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన డిమోన్ పవన్, కళ్యాణ్ పడాల తో పోటీపడి అన్ని రకాలుగా అంటే ఆల్ రౌండర్ గా హోస్ట్ నాగార్జున చేత శెభాష్ అనిపించుకుని, మూడుసార్లు కెప్టెన్ అయ్యాడు.
దానితో ఇమ్మాన్యుయేల్ కప్ కొడతాడు అని చాలామంది భావించారు. కానీ టాప్ 3 లో కూడా లేకుండా పోయాడు. ఆ విషయంలో ఇమ్మాన్యుయేల్ చాలా బాదపడ్డాడు, ఇమ్మాన్యుయేల్ గెలవకపోవడానికి కారణం ఓటింగ్ తగ్గడమే. నామినేషన్స్ లోకి రాకపోవడం ఇమ్మాన్యుయేల్ కి మైనస్ అయ్యింది.
తాజాగా ఇమ్మాన్యుయేల్ ఆదివారం స్టార్ మాలో ప్రసారమయ్యే పరివార్ కి వచ్చాడు. స్టార్ మా పరివార్ లో మీడియా మాదిరి అవినాష్ శ్రీముఖిలు అక్కడికొచ్చిన భరణి, ఇమ్మాన్యుయేల్, రీతూ, డిమోన్ లను ప్రశ్నలు అడిగారు. మీరు గెలవకపోవడానికి కారణం ఏమిటి, ఇకపై హౌస్ లోకి వచ్చే కమెడియన్స్ కి మీరేం సలహా ఇస్తారు అనగానే కామెడీ చెయ్యకండి అన్నాడు ఇమ్మాన్యుయేల్.
మరి కామెడీ చెయ్యొద్దు అన్నాడు అంటే ఇమ్మాన్యుయేల్ కామెడీ చేసినా వర్కౌట్ అవ్వలేదు, బిగ్ బాస్ హౌస్ లో ఎంతగాపోరాడినా వేస్ట్ అనేగా అతను ఫీలయ్యేది అంటున్నారు ఆయన అభిమానులు.




కేరళ స్టోరీ -2ని వివాదాలు వెంటాడుతాయా
Loading..