'అర్ధనారి' బాధ్యత గల సినిమా: భానుశంకర్

Wed 29th Jun 2016 07:25 PM
bhanushankar chowdary interview,ardhanari movie,releasing on 1st july  'అర్ధనారి' బాధ్యత గల సినిమా: భానుశంకర్
'అర్ధనారి' బాధ్యత గల సినిమా: భానుశంకర్
Sponsored links

బాధ్యత లేని వాడికి భారతదేశంలో బ్రతికే హక్కు లేదు అనే కాన్సెప్ట్ తో దర్శకుడు భానుశంకర్ సుమారుగా 55 మంది కొత్త నటీనటులతో 'అర్ధనారి' అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. దర్శకుడు భాను శంకర్ విలేకర్లతో ముచ్చటించారు. 

కొత్త జోనర్ కు చెందిన సినిమా..

ఇంట్రో గ్రూప్ తో క్రియేట్ చేయబడ్డ ఒక పాత్ర అర్ధనారి. సుమారుగా 55 మంది కొత్త ఆర్టిస్ట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించాను. ఈ మధ్యకాలంలో ఎంటర్టైన్మెంట్, కమెడియన్స్ ఉంటేనే సినిమా ఆడుతుందనే ఫీలింగ్ తో అలాంటి సినిమాలే తీస్తున్నారు. ఈ సినిమా వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. కొత్త జోనర్ కు చెందిన సినిమా. కథ, కథనంతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయగలిగితే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారు. ఇదివరకు ఇండస్ట్రీలో అలాంటి చిత్రాలే వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు. ప్రతిఘటన, భారతీయుడు వంటి చిత్రాలను ప్రేక్షకులు చూశారు. అందుకే ఎమోషనల్ ఎంటర్టైన్ తో కూడిన ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. 

వాళ్లకు కూడా లక్ష్యాలు ఉంటాయి..

ఈ సినిమాలో హీరో అర్ధనారి గెటప్ లో తన లక్ష్యాన్ని సాధిస్తాడు. అందుకే ఈ సినిమాకు అదే టైటిల్ ను పెట్టాం. లక్ష్యాలనేవి ఎవరికైనా ఉంటాయి. అలానే హిజ్రాలకు కూడా ఉంటాయి. హీరో హిజ్రా గెటప్ లో చేసే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో ఆ జాతిని తక్కువ చేసి ఎక్కడా.. చూపించలేదు. వారిలోని మంచినే చూపించాను. 

ఇది జెండర్ సినిమా కాదు..

హిజ్రా గెటప్ లో చాలా సినిమాలొచ్చాయి. కానీ ఈ సినిమా అలా ఉండదు. నిజానికి ఇది ట్రాన్స్ జెండర్స్ సినిమా కాదు. హీరో ఆ గెటప్ లో కనిపిస్తాడు అంతే. మొదట ఈ పాత్ర కోసం చాలా మంది హీరోలను అడిగాను. కానీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. కొత్త వాళ్ళతో చేస్తేనేమో మార్కెట్ ఉండట్లేదు.. అలా అని పెద్ద హీరోలు చేయరు. అర్ధనారి పాత్రలో అర్జున్ ఎజిత్ అనే విజయవాడ అబ్బాయి నటించాడు. తనొక కమల్ హాసన్, రజినీకాంత్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా నటించాడు.

ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా..

సొసైటీ కోసం చేసిన సినిమా ఇది. బాధ్యత లేని వాడికి భారతదేశంలో బ్రతికే హక్కు లేదు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీశాను. ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. 

300 థియేటర్లలో సినిమా..

ఈ చిత్రాన్ని సుమారుగా 300 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. 95 రోజులు ఈ సినిమా షూటింగ్ చేశాం. ప్రొడ్యూసర్స్ సపోర్ట్ లేకపోతే అన్ని రోజులు చిత్రీకరణ జరిగేది కాదు. ఇది పబ్లిక్ లో ఉండే సినిమా కాబట్టి నిజమాబాద్ లో 85 రోజులు షూట్ చేశాం. హైద్రాబాద్, శ్రీశైలంలలో నాలుగు రోజులు చిత్రీకరించాం. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ..

కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి ఆధాపడుతుంది. నాకు మాత్రం ఈ తరహా సినిమానే చేయాలనుంది ఇంటర్వ్యూ ముగించారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019