మారుతి పిలిచి అవకాశం ఇచ్చారు!

Mon 27th Jun 2016 07:51 PM
balreddy,rojulu maarayi,dil raju,maruthi  మారుతి పిలిచి అవకాశం ఇచ్చారు!
మారుతి పిలిచి అవకాశం ఇచ్చారు!
Sponsored links

దిల్ రాజు సమర్పకుడిగా, మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం 'రోజులు మారాయి'. మారుతి కథ, స్క్రీన్ ప్లే అందించగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 1 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర సినిమాటోగ్రాఫ‌ర్ బాల్‌రెడ్డి విలేకర్లతో ముచ్చటించారు. ''చెన్నకేశవ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేశాను. అజయ్ విన్సెంట్‌ గారి దగ్గర సుమారుగా ఆరు సినిమాలకు పని చేశాను. ఆ తరువాత వాసు, శ్రీధర్ ఇలా చాలా మంది దగ్గర వర్క్ చేశాను. 'మ‌ల్లెల తీరంలో సిరిమ‌ల్లె పువ్వు' నా డెబ్యు ఫిల్మ్. లక్ష్మీ రావే మా ఇంటికి, మాయ , చిత్రాంగ‌ద సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించాను. మాయ సినిమా తరువాత ఓ మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే కాస్త గ్యాప్ తీసుకున్నాను. మారుతి గారు నన్ను పిలిచి, మా బ్యానర్ లో సినిమా చేయాలనుకుంటున్నాం.. దానికి సినిమాటోగ్రఫీ అందిస్తావా.. అని అడిగారు. నిజానికి 'మ‌ల్లెల తీరంలో సిరిమ‌ల్లె పువ్వు' సినిమా సమయంలో మారుతి గారు నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినా.. చాలా సింపుల్ గా ఉంటారు. దిల్ రాజు గారు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులు అని తెలిసి మొదట భయపడ్డాను. కానీ ఆయన సినిమా చూసి నచ్చిందని చెప్తే చాలు సక్సెస్ అనే ఫీలింగ్ ఉండేది. సినిమా చూసిన తరువాత చాలా బాగా చేసారని చెప్పారు. ప్రమోషన్స్ కూడా బాగా చేద్దామని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా తరువాత మారుతి గారి బ్యానర్ లోనే ఓ సినిమా ఉంటుంది కానీ నాకు ఆయన దర్శకత్వంలో పని చేయాలనే కోరిక ఉంది'' అని చెప్పారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019