గ్లామర్ తో పాటు నటన కూడా ఉండాలి: సురభి

Sat 25th Jun 2016 07:43 PM
surabhi,gentlemen movie,nani,mohan krishna indraganti  గ్లామర్ తో పాటు నటన కూడా ఉండాలి: సురభి
గ్లామర్ తో పాటు నటన కూడా ఉండాలి: సురభి
Sponsored links

నాని, సురభి, నివేద ప్రధానపాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జెంటిల్ మన్'. రీసెంట్ గా విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా.. సురభి విలేకర్లతో ముచ్చటించారు. ''నేను తమిళంలో నటించిన వేళ ఇల్లాద పట్టదారి సినిమా తెలుగులో రఘవరన్ బి.టెక్ అనే పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళంలో మంచి సక్సెస్ అయింది. నాని ఆ సినిమాలో నన్ను చూసి మోహన్ సార్ కి చెప్పాడు. ఆయనకు కూడా నా నటన నచ్చడంతో 'జెంటిల్ మన్' సినిమాకు సెలక్ట్ చేశారు. నానితో కలిసి వర్క్ చేయడం బాగా అనిపించింది. చాలా సపోర్ట్ చేస్తారు. నటన విషయంలో బెటర్ మెంట్ చూపించగలడు. ఈ సినిమాలో నాతోపాటు మరో హీరోయిన్ నటిస్తుందని నేను ఆలోచించలేదు. నివేద మంచి అమ్మాయి. ఇద్దరం మంచి స్నేహితులమయిపోయాం. అయినా మా ఇద్దరివి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకరితో ఒకరిని పోల్చలేం. ర‌ఘువ‌ర‌న్ బి.టెక్‌, బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా, జెంటిల్ మ‌న్ ఇలా వరుస విజయాలు అందుకున్నాను. నాకు ఎలాంటి పాత్రలు సూట్ అవుతాయో.. అవే ఎన్నుకుంటాను. ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను. తెలుగు ఇండస్ట్రీ నన్ను ఎంతగానో ఆదరిస్తుంది. ప్రేక్షకులు నేను నటించిన ప్రతి సినిమాను ఆదరిస్తూ.. వస్తున్నారు. చిన్నప్పటి నుండి నాకు నటన అంటే ఇష్టం. అలానే పెయింటింగ్ కూడా.. పెయింటింగ్ లో కోర్స్ చేశాను. ఆ తరువాత సినిమాల్లోకి రావడాన్ని ప్రయత్నాలు చేసి, తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చాను. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన తరువాత వరుసగా తెలుగు అవకాశాలు వస్తున్నాయి. సందీప్ తో బీరువా సినిమా చేసిన తరువాత తమిళంలో తనతో మరో సినిమా చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. నేను కథ ఎన్నుకున్నప్పడు నా పాత్ర, డైరెక్టర్ ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ఒక చేస్తాను. పూర్తి స్థాయి గ్లామర్ రోల్స్ కాకుండా పెర్ఫార్మన్స్ తో పాటు ఉండే గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను'' అని చెప్పారు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019