సినీజోష్ ఇంటర్వ్యూ: రామరాజు

Wed 22nd Jun 2016 09:35 PM
ramaraju interview,oka manasu,niharika,naga shourya  సినీజోష్ ఇంటర్వ్యూ: రామరాజు
సినీజోష్ ఇంటర్వ్యూ: రామరాజు
Sponsored links

నాగశౌర్య, నీహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీధర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'ఒక మనసు'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 24 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. దర్శకుడు రామరాజుతో సినీజోష్ ఇంటర్వ్యూ.. 

మనిషికి గుర్తుండిపోయేవి ప్రేమకథలే..

ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను సినిమా చేయడానికి కారణం కథ నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. నమ్మకంతో చేసిన సినిమా ఇది. మనిషికి గుర్తుండిపోయేవి ప్రేమ కథలే. చిన్నప్పటి నుండి ప్రేమ కథలు చూస్తూనే పెరిగాను. ఒకప్పుడు మనిషిని డబ్బు ప్రభావితం చేసేది. కానీ ఇప్పుడు రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవంగా జరుగుతున్నదాన్నే హ్యూమన్ డ్రామా గా తెరకెక్కించాను. 

మొదట సమంత అనుకున్నాను..

కథ రెడీ చేసుకొని టీవీ9 వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఓ కమర్షియల్ ఫేస్ తో సినిమా చేయాలనుకున్నాను. దానికోసం ముందుగా సమంత ను హీరోయిన్ గా అనుకున్నాం. తనకు కథ నచ్చింది. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. అలానే రెజీనాను కూడా అనుకున్నాం. తనకు అదే పరిస్థితి. కథను నమ్ముకొని సినిమా చేస్తున్నప్పుడు కమర్షియల్ గా వెళ్లడం ఎందుకని భావించి, కొత్త వాళ్ళతో వెళ్ళిపోదాం అనుకున్నాం. అదే సమయంలో మధురా శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ చేసి నీహారిక అయితే మీకు కథకు సెట్ అవుతుందా..? అనడిగారు. నేను వెంటనే గూగుల్ చేసి తన ఫోటోలు కొన్ని చూశాను. ఒక ఫోటోలో నేను సంధ్య పాత్రను చూశాను. తన ఫోటోలో ఆ ఇన్నోసెన్న్ నచ్చింది. 

మొదట భయపడ్డా..

మొదట నీహారికను హీరోయిన్ గా పెట్టాలనుకున్నప్పుడు భయపడ్డాను. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి చాలా అబ్జెక్షన్స్ ఉంటాయనుకున్నాను. కానీ నీహారిక, సంధ్య పాత్రకు తగిన అమ్మాయని ధైర్యం చేశాను. సినిమా కథ నిహారికకు, తన తల్లి తండ్రులతో కలిసి చెప్పాలనుకున్నాను. ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అక్కడితో వొదిలేద్దాం అని, లేదా ఏమైనా కరెక్షన్స్ చేసుకోవచ్చని.. వివరంగా చెప్పాను. నిహారికకు కథ బాగా నచ్చింది. ఎంతగా అంటే.. సెట్ లో ఉన్నప్పుడు నీహా అని పిలిస్తే పలికేది కాదు. సంధ్య అంటేనే పలికేది. 

సినిమాలు చేయకూడదనుకున్నాను.. 

మల్లెల తీరం సినిమా తరువాత నేను సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నాను. ఆ సమయంలో సినిమాలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను. సినిమా అంటే ఆర్ట్ కాదు వ్యాపారం అయిపోయింది. ఆ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేసుకొని మరొక సినిమా చేయడానికి సమయం పట్టింది. రెగ్యూలర్ సినిమాలు చేయడానికి నేను అవసరం లేదు. చాలా మంది చేస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ కథకు చాలా గ్యాప్ వచ్చింది. కానీ నిజాయితీగా చెప్తే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా ఆదరిస్తారు. తమిళ మార్కెట్ ను పెంచింది కూడా మన తెలుగు వాళ్లే. 

కమర్షియల్ అర్ధం అది..

కమర్షియల్ అంటే ఎక్కువ డబ్బు ఖర్చు సినిమా చేయడం కాదు. తక్కువ బడ్జెట్ లో సినిమా చేసిన దానికి డబ్బు వస్తే అది అసలైన కమర్షియల్ సినిమా. 

నెస్ట్ ప్రాజెక్ట్స్..

ఇదే చిత్ర నిర్మాతలతో నా తదుపరి సినిమా ఉంటుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019