ఫ్లాప్స్ నన్ను బాధపెడతాయి: సమంత

Tue 31st May 2016 09:00 PM
samantha interview,a aa movie,nithin,trvikram srinivas  ఫ్లాప్స్ నన్ను బాధపెడతాయి: సమంత
ఫ్లాప్స్ నన్ను బాధపెడతాయి: సమంత
Sponsored links

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందించిన చిత్రం 'అ ఆ' అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అన్నది ఉప శీర్షిక. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. హీరోయిన్ సమంతతో సినీజోష్ ఇంటర్వ్యూ..

చివరి సమ్మర్ సినిమా..

'అ ఆ' సమ్మర్ లో నా చివరి సినిమా. ఇది నా కెరీర్ కు చాలా ముఖమైనది. నేను ఇప్పటివరకు సీరియస్, ఇంటెన్స్, రొమాన్స్ ఇలా రకరకాల జోనర్స్ సినిమాల్లో నటించాను. కానీ కామెడీ మాత్రం ట్రై చేయలేదు. మొదటిసారి కామెడీ పాత్రలో నటిస్తున్నాను. నాకు మొదటి నుండి కమెడియన్స్ అంటే చాలా గౌరవం. కామెడీ అనేది చాలా కష్టమైన జోనర్. నన్ను నమ్మి ఇలాంటి రోల్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. నేను నా పాత్రకు జస్టిస్ చేశాననే అనుకుంటున్నాను.

మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది..

త్రివిక్రమ్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఈ సినిమాలో నేను ఎక్కువ ఆయన్నే ఇమిటేట్ చేశాను. 'అ ఆ' ఓ కొత్త కాన్సెప్ట్ అని నేను చెప్పను గానీ.. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరి మొహం మీద నవ్వు మాత్రం ఉంటుందని చెప్పగలను. నేను ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తరువాత మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలనిపించింది.

స్క్రిప్ట్ నచ్చి చేశాను..

త్రివిక్రమ్ గారి సినిమా అని నేను ఒప్పుకోలేదు. మొదటి నుండి నన్ను గమనించి ఉంటే నేను స్క్రిప్ట్ నచ్చితేనే తప్ప ఎవరి గురించో సినిమా చేయను. మొదట స్క్రిప్ట్ విని నన్ను కన్విన్స్ చేసే విధంగా ఉంటే సినిమా చేస్తాను.

ఇదొక సింపుల్ ఫిలిం..

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కు తక్కువ ప్రాముఖ్యత ఉండే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. పది సినిమాల్లో ఒక సినిమాకు మాత్రమే హీరోయిన్ కు మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి నేపధ్యంలో నాకు 'అ ఆ' లాంటి మంచి సినిమాలో నటించే అవకాసం వచ్చింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరికీ సమాన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రేమ కథను మాత్రమే కాకుండా కుటుంబంలోని బంధాలను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి పూర్తి స్థాయి ప్రేమ కథను త్రివిక్రమ్ గారు ఇప్పటివరకు చేయలేదు.

నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది..

ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. చాలా అల్లరి చేస్తూ.. తొందరగా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది.

కంఫర్టబుల్ గా నటించగలను..

అదే దర్శకులతో, హీరోలతో మళ్ళీ మళ్ళీ పని చేయడం నేను కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్, హీరో నితిన్ లతో నాకు మంచి స్నేహం ఉంది. ఈ సినిమాలో ఇన్హిబిషన్స్ లేకుండా నటించాల్సి వచ్చింది. దానికి వాళ్ళతో ఉన్న మంచి రిలేషన్షిప్ నాకు హెల్ప్ అయింది. 

మొదట త్రివిక్రమ్ తప్పు చేశాననుకున్నారు..  

నితిన్ నాకు మంచి ఫ్రెండ్. సో.. సినిమా మొదలయిన రెండు రోజుల షూటింగ్ లో మా ఇద్దరికి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. త్రివిక్రమ్ గారు వీరిద్దరినీ సెలక్ట్ చేసుకొని తప్పు చేశాననుకున్నారు.

ఫ్లాప్స్ నన్ను బాధపెడతాయి.. 

నేను హిట్స్, ఫ్లాప్స్ బాగా పట్టించుకుంటాను. హిట్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడతానో.. ఫ్లాప్ వచ్చినప్పుడు అంతే బాధ పడతాను. అయినా.. రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సమ్మర్ లో రిలీజ్ అయిన నా సినిమాలు 'తేరి','24' మంచి విజయాలను అందుకున్నాయి. 'బ్రహ్మోత్సవం' మాత్రం అనుకున్న రిజల్ట్ ఇవ్వలేకపోయింది. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

'యూ టర్న్' రీమేక్ సినిమాలో నటిస్తున్నాను. పవన్ అనే దర్శకుడు ఆ సినిమాకు పని చేస్తున్నాడు. తమిళ, తెలుగు బాషలలో సినిమా రిలీజ్ అవుతోంది. తెలుగులో 'జనతా గ్యారేజ్' సినిమాలో నటిస్తున్నాను. ఇప్పటివరకు తెలుగులో మరే సినిమాకు సైన్ చేయలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019