సినీజోష్ ఇంటర్వ్యూ: విశాల్

Thu 12th May 2016 08:10 PM
vishal interview,rayudu movie,mutthayya  సినీజోష్ ఇంటర్వ్యూ: విశాల్
సినీజోష్ ఇంటర్వ్యూ: విశాల్
Sponsored links

విశాల్‌, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్‌ సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం 'రాయుడు'. ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. మే 27న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి విశాల్ హైద‌రాబాద్‌లో గురువారం విలేకర్లతో ముచ్చటించారు.

ఇదొక రూరల్ సినిమా..

మ‌దురైలోని రాజ‌పాళ్యం అనే ప్రాంతంలో ఈ సినిమాను చిత్రీక‌రించాం. ముత్త‌య్య మంచి మాస్ డైరెక్టర్. ఇదివరకే నాకు కొన్ని కథలు చెప్పారు. నాతో సినిమా చేయాల‌న్న‌ది ఆయ‌న‌ కోరిక. ప్రేక్షకులు నన్ను ఇష్టపడే విధంగా ఈ సినిమాను రూపొందించారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇదొక రూర‌ల్ సినిమా. బామ్మ‌కి మ‌న‌వ‌డికి మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. ఈ సినిమాకు హీరో, హీరోయిన్ ఇద్ద‌రూ బామ్మే. నేను ఈ సినిమాలో బస్తాలు మోసే క్యారెక్టర్ చేశాను. పందెం కోడి, వాడు వీడు సినిమాల తరువాత పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నటించిన సినిమా ఇది. నా లుక్ కూడా చాలా మాస్ గా ఉంటుంది. గడ్డం, టాటూతో కనిపిస్తాను.

కైమాక్స్ హైలైట్ గా ఉంటుంది..

ఈ సినిమా క్లైమాక్స్ అందరికీ నచ్చుతుంది. సినిమాలో అదే హైలైట్. నేను ఎక్కడకి వెళ్ళినా.. పందెం కోడి లాంటి సినిమా కావాలని అడుగుతున్నారు. దాన్ని మించి ఈ సినిమా ఉంటుంది.

ఆ గుణం ఇమాన్ లో కనిపిస్తుంది..

ఇదివరకు కూడా నేను ఇమాన్‌తో కలిసి ప‌నిచేశాను. ఆయ‌న సంగీతం వినేకొద్దీ బావుంటుంది. ఐదేళ్ల త‌ర్వాత విన్నా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇళ‌య‌రాజా సార్ సంగీతంలో ఆ గుణం ఉంటుంది. ఇప్పుడు నాకు ఇమాన్‌లోనూ ఆ గుణం క‌నిపిస్తోంది.

ఫైట్స్ స్పెషల్ గా ఉంటాయి..

ఈ సినిమాలో ఫైట్స్ చాలా స్పెష‌ల్‌గా ఉంటాయి. కండ‌లు తిరిగిన ఒక వ్యక్తి ప‌ది మందిని కొడితే ఎంత సహజంగా ఉండాలో, అంత నేచుర‌ల్‌గా తెర‌కెక్కించారు. ఎక్క‌డా రోప్ వ‌ర్క్ వాడ‌లేదు. ఈ సినిమా కోసం కాస్త బ‌రువు పెరిగాను. అన‌ల్ అర‌సు నాతో ఫైట్స్ చేయించ‌డాన్ని ఎంజాయ్ చేస్తారు. 

తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం చేస్తున్నా..

నాతో తెలుగులో సినిమా చేయాలని ఒక డైరెక్టర్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. సమయం చూసుకొని ఆయనతో సినిమా చేయాలి.

అందుకే టెంపర్ రీమేక్ చేస్తున్నా..

టెంపర్ సినిమాలో ఒక సోషల్ కాజ్ ఉంటుంది. అందుకే తమిళ ప్రేక్షకులకు కూడా ఆ కథను చెప్పాలని భావిస్తున్నాను. ఒక సోషల్ కాజ్ ను కమర్షియల్ చిత్రాలకు జోడిస్తే అందరికి రీచ్ అవుతుంది.

నడిగర్ విశేషాలు.. 

నేను నడిగర్ సంఘంలో ఎన్నికైన తరువాత నష్టాల్లో ఉన్న సంస్థను 9 కోట్ల ప్రాఫిట్ తో ఉండేలా చూసుకున్నాను. అలానే ఒక బిల్డింగ్ కూడా నిర్మిస్తున్నాం.

అక్కడ జరిగే మొదటి పెళ్లి నాదే..

కళ్యాణ మండపం ఒకటి కడుతున్నాం. 2018 జనవరి 14న దాన్ని ప్రారంభించబోతున్నాం. జనవరి 15న అక్కడ జరిగే మొదటి పెళ్లి నాదే. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

శిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాను. అక్టోబ‌ర్ 7న ఆ సినిమాను విడుద‌ల చేయాలనుకుంటున్నాం. జులై నుండి మిష్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త ప్రాజెక్ట్ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత టెంప‌ర్ సినిమా రీమేక్ చేస్తాను. అలానే బాలాగారితోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019