బర్త్ డే స్పెషల్: సందీప్ కిషన్

Fri 06th May 2016 09:26 PM
sundeep kishan interview,birthday special,okka ammayi thappa  బర్త్ డే స్పెషల్: సందీప్ కిషన్
బర్త్ డే స్పెషల్: సందీప్ కిషన్
Sponsored links

'ప్రస్థానం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటుడు సందీప్ కిషన్. ఆ తరువాత 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్','బీరువా','టైగర్' వంటి చిత్రాల్లో నటించిన ఈ యువ హీరో మే 7న తన పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా తను ప్రస్తుతం తెలుగులో నటిస్తోన్న 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్ర విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు.

ఎదుటివారిని బాగా చదివే క్యారెక్టర్..

ఈ సినిమాలో కాలేజ్ డ్రాప్ అవుట్ అబ్బాయి పాత్రలో కనిపిస్తాను. చదువంటే ఇష్టం లేక మధ్యలోనే వదిలేస్తాడు. చాలా తెలివైన వాడు. ఎదుటివారిని చదివే క్యారెక్టర్. ఎంతో ఫన్ గా ఎనర్జిటిక్ గా ఉంటాడు. 

ట్రాఫిక్ లో జరిగే కథ..

హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ ట్రాఫిక్ మధ్య జరిగే కథ. ఇద్దరు ప్రేమికులు ఆ ట్రాఫిక్ జామ్ నుండి తమ సమస్యను దాటుకొని ఎలా బయటపడారనేదే స్టోరీ. ట్రాఫిక్ జామ్ అనేది సినిమాలో ప్రైమ్ ఎలిమెంట్. ఫ్లై ఓవర్ మీద సుమారుగా 60% షూటింగ్ జరుగుతుంది. రియలిస్టిక్ ఎమోషన్స్ ను బేస్ చేసుకొని సినిమా చేశారు. స్క్రీన్ ప్లే సినిమాను పరుగెత్తిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్  తోనే సినిమాను రూపొందించాం.

బెస్ట్ డైరెక్టర్..

ఇప్పటివరకు నేను పని చేసిన అందరి కమర్షియల్ డైరెక్టర్స్ లో రాజసింహ బెస్ట్ డైరెక్టర్. నిజానికి ఈ కథ నాకు 2012 నుండి తెలుసు. నాకు నచ్చి పక్కన పెట్టుకున్న రెండు కథలు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఒక్క అమ్మాయి తప్ప. కాని ఇది చాలా కాంప్లికేటెడ్ ఫిలిం. హైదరాబాద్ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ మీద అరవై శాతం సినిమా షూటింగ్ అంటే ప్రాక్టికల్ గా జరగదు. ఆ విజన్ ను నమ్మడానికి, నమ్మించడానికి ఈ మూడు సంవత్సరాల సమయం పట్టింది. 

నిత్యకు బాగా నచ్చింది.. 

ఈ సినిమాలో నాతో పాటు నిత్యమీనన్ నటిస్తోంది. మా ఇద్దరి పెయిర్ స్క్రీన్ మీద బావుంటుంది. హైట్ విషయంలో మాకు ఎలాంటి సమస్యలు రాలేదు. సరదాగా సెట్ లో మాత్రం ఒకరినొకరం కామెంట్ చేసుకునేవాళ్ళం. నిత్య ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కూడా కథే. డైరెక్టర్ తనను ఇంప్రెస్ చేయాలని లవ్ సీన్స్ రెండు, మూడు యాడ్ చేసి కథ చెప్తే.. అవి లేకుండానే కథ బావుంటుందని.. ఆ సీన్స్ లేకుండానే సినిమా చేద్దామని చెప్పింది. తనలో ఆ గొప్పతనం ఉంది.

సి.జి. వర్క్ ఉంటుంది..

ఇది పక్కా కమర్షియల్ సినిమా. అయినా.. ఒక కొత్త పాయింట్ తో కథ డ్రైవ్ అవుతూ ఉంటుంది. పాటలు, ఫైట్స్ చాలా బావుంటాయి. పెద్ద స్కేల్ లో సినిమా ఉంటుంది. నిజానికి ఫ్లై ఓవర్ మీద అరవై శాతం షూటింగ్ అంటే వర్కవుట్ కాదు. అన్నపూర్ణ లో సెట్ వేసి సీన్స్ తీశాం. వారం రోజులు మాత్రం ఫ్లై ఓవర్ మీదే షూట్ చేశాం. సి.జి వర్క్ ఎక్కువ ఉంటుంది. కాని అలా అనిపించకుండా ఉండే తీయడానికి ప్రయత్నించాం.

నెగెటివ్ రోల్స్ చేస్తాను..

నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తారా..? అనడిగితే దానికి తగ్గ కథ రావాలి. కథ నచ్చితే ఖచ్చితంగా చేస్తాను. హీరో, విలన్ అనే వేరియేషన్ చూడను. 

రిజల్ట్ పట్టించుకోకుండా ఉండాలి..

నా కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ రెండూ ఉన్నాయి. మంచి సినిమాలు, గొప్ప సినిమాలు, బ్యాడ్ ఫిలిం ఇలా అన్ని చేశాను. ప్రతి సినిమా హిట్ అవ్వాలనే చేస్తాం. ఆ కథ ఆడియన్స్ కు నచ్చాలనే చేస్తాం. సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు కథ నచ్చకపోతే.. వాళ్ళకి నచ్చేలా మనం సినిమా చేయలేకపోయామని అనుకుంటాను. హిట్స్, ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా ఉండడం ముఖ్యం. 

కృష్ణవంశీ గారితో పని చేయడం నా కల..

నేను ఇండస్ట్రీకు వచ్చిన కొత్తలో కృష్ణవంశీ గారితో పని చేయాలని అనుకునేవాడిని. ఇన్నిరోజులకి నాకు అలాంటి గొప్ప అవకాశం వచ్చింది. ఆయన దగ్గర నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయనకు తెలియని విషయం అంటూ.. ఉండదు. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

కృష్ణవంశీ గారితో 'నక్షత్రం', తమిళంలో నేను, లావణ్య త్రిపాఠి కలిసి 'మయవన్' అనే సినిమాలో నటిస్తున్నాం. అలానే తమిళంలో పోటేన్షియల్ స్టూడియోస్ వారి బ్యానర్ లో మరో సినిమాలో నటిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019