Advertisement

రీమిక్స్ చేయడమంటే భయం: సాయి కార్తిక్

Mon 25th Apr 2016 07:40 PM
sai karthik,raja cheyyi vesthe,nara rohit  రీమిక్స్ చేయడమంటే భయం: సాయి కార్తిక్
రీమిక్స్ చేయడమంటే భయం: సాయి కార్తిక్
Advertisement

'కాల్ సెంటర్' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సుమారుగా యాభై సినిమాలకు తన సంగీతాన్ని అందించిన మూసిచ్ డైరెక్టర్ సాయి కార్తిక్. ప్రస్తుతం సాయి కార్తిక్ మ్యూజిక్ చేసిన 'రాజా చెయ్యి వేస్తే' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. సాయి కార్తీక్ విలేకర్లతో ముచ్చటించారు. 

''2008లో కాల్ సెంటర్ సినిమాతో నా  ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయాను. మంగళ, జెండాపై కపిరాజు ఇలా పదిహేను సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాను. ఐదారు కన్నడ సినిమాలకు పని చేశాను. ఇరవై నుండి ఇరవై ఐదు తెలుగు సినిమాలు చేశాను. నాకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటాను. పైసా, జెండాపై కపిరాజు, రౌడీ, ప్రతినిధి, పటాస్, అసుర, రాజుగారి గది, టెర్రర్, రన్, తుంటరి, ఈడో రకం ఆడో రకం చిత్రాలతో మరింత గుర్తింపు లభించింది. కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ వంటి లెజండరీ డైరెక్టర్స్ తో పని చేసే అవకాసం వచ్చింది. సుమారుగా 250 పాటలకు మ్యూజిక్ చేశాను. చాలా మంది సింగర్స్ ను పరిచయం చేశాను. నారా రోహిత్ తో మొదట శంకర సినిమాకు వర్క్ చేశాను. ఆయనకు నాకు బాగా సింక్ అవ్వడం వలన వరుసగా ఆయన నటిస్తున్న సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నాను. స్టార్ హీరోలకు మ్యూజిక్ చేయలేదనే ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ త్వరలోనే ఆ అవకాశం కూడా వస్తుందని ఆశిస్తున్నాను. నా కెరీర్ లో హారర్, కామెడీ, కమర్షియల్, రోమాన్స్ ఇలా అన్ని రకాల జోనర్స్ లో ఉండే పాటలు చేశాను. పైసాలో 'నీతో ఏదో చెప్పాలని', రౌడీలో 'నీ మీద ఒట్టు' అనే పాటలు నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. నాకు రీమిక్స్ సాంగ్స్ చేయడమంటే చాలా భయం. ఇప్పటివరకు మూడు, నాలుగు పాటలు చేశాను. వాటికి బ్యాడ్ నేమ్ అయితే రాలేదు. రీమిక్స్ లో హైలైట్ అయిన మ్యూజిక్ ను పెట్టుకొని ఫ్లేవర్ మిస్ కాకుండా కొత్త బీజియమ్స్ యాడ్ చేసి చేస్తాను. 'రాజా చెయ్యి వేస్తే' సినిమా నా యాభైవ సినిమాగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం సుప్రీమ్, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలకు వర్క్ చేస్తున్నా'' అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement