మేము పొగరుతో రావట్లేదు: నాగేశ్వరరెడ్డి

Sun 10th Apr 2016 08:06 PM
nageshwara reddy interview,eedo rakam aado rakam,vishnu,raj tarun  మేము పొగరుతో రావట్లేదు: నాగేశ్వరరెడ్డి
మేము పొగరుతో రావట్లేదు: నాగేశ్వరరెడ్డి
Sponsored links

'సీమశాస్త్రి','సీమ టపాకాయ్','దేనికైనా రెడీ' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు నాగేశ్వరరెడ్డి. మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన 'ఈడో రకం.. ఆడో రకం' చిత్రానికి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. నాగేశ్వరరెడ్డితో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా అంటే డ్యూటీ..

ఇద్దరు ఫ్రెండ్స్ అబద్దాలు చెబుతూ.. వాళ్ళ పనులు చేయించుకుంటూ ఉంటారు. ఆ అబద్దాల వలన వాళ్ళ సన్నిహితులు, బంధువులు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసారనేదే సినిమా కథ. నేనే సినిమా చేసిన అందులో ఒక సందేశాన్ని చెప్పాలనుకుంటాను. సినిమా అంటే డ్యూటీ. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు కుటుంబానికి దూరంగా సెపరేట్ గా ఉండాలనుకుంటున్నారు. కాని ఈ సినిమా చూసిన తరువాత వారి ఆలోచన విధానంలో మార్పొస్తుంది. 

విష్ణుతో సోలో సినిమా అనుకున్నాను..

మొదట విష్ణు సోలో హీరోగా సినిమా చేయాలనుకున్నాను. అయితే రాజా రవీంద్ర నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో రాజ్ తరుణ్ కూడా నటించాలనుకుంటున్నాడని చెప్పాను. రాజ్ తరుణ్, విష్ణు ల కాంబినేషన్ బావుతుందని కథలో మార్పులు చేసి సినిమా చేశాను. విష్ణు, రాజ్ తరుణ్ ల మధ్య మంచి ర్యాపో కుదిరింది. కథలో కాస్త ఫన్ పెంచి చేశాం.

మొదట వేరే ప్రొడక్షన్ అనుకున్నాం..

ఈ సినిమాను భోగవల్లి ప్రసాద్ గారి ప్రొడక్షన్ లో విష్ణు హీరోగా చేయాలనుకున్నాం కాని కుదరలేదు. ఫైనల్ గా అనిల్ సుంకర గారితో కుదిరింది. అనిల్ లాంటి నిర్మాతలతో కలిసి పని చేస్తే మనశ్శాంతి ఉంటుంది. 

స్టార్ హీరోలు అడిగారు..

నాతో సినిమాలు చేస్తామని నాగార్జున, వెంకటేష్, గోపీచంద్, రవితేజ వంటి స్టార్ హీరోలు అడిగారు. కాని కొన్ని కమిట్మెంట్స్ వలన కుదరలేదు. భవిష్యత్తులో కచ్చితంగా చేస్తానని చెప్పగలను.

రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర కీలకం..

ఈ సినిమా రాజేంద్రప్రసాద్ గారు విష్ణుకి తండ్రి పాత్రలో కనిపిస్తారు. ఆయనను కన్ఫ్యూజ్ చేయడమే ఇద్దరి హీరోల టార్గెట్.

చాలా ప్రొఫెషనల్..

బొంబాయి నుండి వచ్చే హీరోయిన్స్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. సొనారిక. హేబ్బా కూడా బొంబాయి అమ్మాయిలే. ఈ సినిమాలో చాలా బాగా నటించారు.

మాది ఫ్యామిలీ సినిమా..

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు 'సరైనోడు'కు మధ్యలో మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. మేము పొగరుతో రావట్లేదు. నమ్మకంతో వస్తున్నాం. అయినా.. సర్దార్, సరైనోడు సినిమాలు మాస్ ఎంటర్టైనర్స్. మాది ఫ్యామిలీ సినిమా. 

ప్రొడక్షన్ లో కూడా సక్సెస్ అవుతా..

నాకు ప్రొడక్షన్ అంటే ఆశక్తి ఉంది కాని ఎందుకో ఆ రంగంలో సక్సెస్ కాలేకపోతున్నా.. కచ్చితంగా భవిష్యత్తులో మాత్రం హిట్ సినిమాలను నిర్మించాలనేదే నా టార్గెట్.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

సుశాంత్ తో 'ఆటాడుకుందాం రా..' సినిమా చేస్తున్నాను. జూన్ మొదటి వారంలో ఆ సినిమా రిలీజ్ అవుతోంది. అలానే నరేష్ హీరోగా.. భోగవల్లి ప్రసాద్ గారి నిర్మాణంలో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019